డిగ్రీ అధ్యాపక పరీక్షలకు 60.78 శాతం హాజరు..


Ens Balu
5
Srikakulam
2020-09-16 19:16:21

శ్రీకాకుళం జిల్లాలో  రెండు రోజులు పాటు జరిగిన  ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపక (లెక్చరర్)  పోస్టుల నియామక పరీక్షలకు 60.78 శాతం మంది అభ్యర్ధులు హాజ రైనట్లు జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి పేర్కొన్నారు. సెప్టెంబర్ 15 మరియు 16వ తేదీల్లో నిర్వహించిన డిగ్రీ అధ్యాపక పరీక్షలు  ప్రశాంతంగా ముగిసా యని, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని స్పష్టం చేసారు. ఉదయం 9.30గం.ల నుండి మధ్యాహ్నం 12.00గం.ల వరకు, మధ్యా హ్నం 3.00గం.ల నుండి సాయంత్రం 5.30గం.ల వరకు రెండు విడతలుగా రాజాంలోని జి.యం.ఆర్.ఐ.టి, ఎచ్చెర్లలోని శ్రీ శివానీ, శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలలతో పాటు టెక్కలి ఐతం ఇంజినీరింగ్ కళాశాలల్లో పరీక్షలు జరిగిన సంగతి విదితమే. ఇందుకు జిల్లావ్యాప్తంగా 487 మంది అభ్యర్ధులు హాజరుకావాల్సి ఉండగా 296 అభ్యర్ధులు హాజరయ్యారని, 191 మంది అభ్యర్ధులు హాజరుకాలేదని ఆయన వివరించారు. దీంతో 60.78 శాతం మంది అభ్యర్ధులు హాజరు అయినట్లు డి.ఆర్.ఓ స్పష్టం చేసారు. పరీక్షలు విజయవంతంగా నిర్వహించిన కళాశాలల యాజమాన్యాలు, ఏ.పి.పి.యస్.సి కార్యాలయ సెక్షన్ ఆఫీసర్ ఢిల్లీశ్వరరావు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పద్మప్రియ, చీఫ్ సూపరింటెండెంట్లు, లైజన్ ఆఫీసర్లు, ఉప తహశీల్ధారులు, ఇతర సిబ్బంది తదితరులకు డి.ఆర్.ఓ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.