రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు..


Ens Balu
2
కలెక్టరేట్
2020-09-16 19:21:09

విశాఖ జిల్లా లో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టరు ఆర్. గోవిందరావు అధికారులను ఆదేశించారు.  బుధవారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ  వాహనదారులకే కాకుండా ప్రజలందరికీ రహదా రి భద్రతపై  పూర్తి అవగాహన కలిగించాలన్నారు.  ప్రమాదాలకు కారణమౌతున్న అతివేగం, అవగాహనా రాహిత్యం, అలసత్వాల మూలంగా జరిగే ప్రమాదాలు, వాటి వలన కుటుంబాలకు జరిగే నష్టాలపైన తెలియజేయాలన్నారు.  ప్రమాదాలు  జరిగేందుకు అవకాశం వున్న ప్రదేశాలను రవాణా, పోలీసు, ఇంజనీరింగ్ శాఖల అధికా రులు జాయింట్ ఇనస్పెక్షన్ చేయాలన్నారు.  అటువంటి ప్రదేశాలలో తక్షణ చర్యలు, నిర్మాణాలు చేపట్టాలన్నారు. రవాణాశాఖ ఉప కమీషనరు  రాజరత్నం మాట్లా డుతూ గత సంవత్సర కాలంలో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయన్నారు.  కోవిడ్ లాక్ డౌన్ పరిస్థితులు ఏర్పడక ముందే జిల్లాలో ప్రమాదాల రేటు 20.95 శాతం తగ్గందని, రాష్ట్ర తగ్గుదల సగటు   కంటే  ఎక్కువగా వుందన్నారు.  కోవిడ్19 మూలంగా వాయిదా పడిన నిర్మాణాలను  వేగంగా పూర్తిచేయాలని వివిధ శాఖల అధికారులకు ఆయన విజ్ఖప్తి చేశారు.  నగరంలో జాతీయరహదారి పై నున్న డివైడర్ల పై పెంచే మొక్కలు ఎత్తుగా పెరిగి నందున క్రాసింగ్స్ వద్ద పాదచారులకు  వాహనాలు కనబడక ప్రమాదాలకు కారణమౌతున్నాయని  పోలీసు శాఖ వారు తెలియజేశారు.  దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని జివియంసి వారిని కోరారు. ఈ సమావేశం లో అడిషనల్ ఎస్.పి. బి.అచ్యుతరావు, ఎసిపిలు ఎమ్.ఆర్.కె రాజు, సిహెచ్.పాపారావు, జివియంసి  ఎసి.ఈ. కె.శాంసన్ రాజు, ఆర్.అండ్ బి ఎస్.ఈ.  వి.కేశవరావు, ఎపిఎస్ ఆర్టిసి  డివియం బి.ఎ.నాయుడు,  పంచాయితీరాజ్  ఎస్.ఈ.  జి.సుధాకరరెడ్డి,  కెజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్  పి.వి.సుధాకర్ , డిఎంఅండ్.హెచ్.వో డాక్టర్  కె.విజయలక్ష్మి , డి.సి.హెచ్.    వి.లక్ష్మణరావు  ఆర్టీవోలు జి.ఆర్.రవీంద్రనాధ్, ఐ.శివప్రసాద్  తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు