విశాఖలో 31న జర్నలిస్ట్ ల ఉగాది సంబురాలు.. గంట్ల శ్రీనుబాబు
Ens Balu
10
Visakhapatnam
2022-03-24 07:05:15
ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్,ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ ల ఆధ్వర్యంలో (సంయుక్తంగా )ఈనెల 31 తేదీన శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించనున్నట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు తెలిపారు. విశాఖలోని వి జె ఎఫ్ వినోద వేదికక లో జరిగిన కార్యవర్గ సమావేశానికి ఏపీ డబ్ల్యూజేఎఫ్ నగర అధ్యక్షులు పి. నారాయణ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ నిరంతరం మానసిక ఒత్తిడికి లోనయ్యే జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులకు ఆటవిడుపుగా ఈ సంబరాలు నిర్వహిస్తున్నామని, జర్నలిస్టుల సంక్షేమంతో పాటు వినోద కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతోందన్నారు. ఆరోజు ఉదయం 10 గంటలకు వైశాఖ జలఉద్యానవనములో ఈ వేడుకలు మొదలవుతాయని పంచాంగ శ్రవణం,లక్కీ డిప్, సంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని చెప్పారు. ఈ సందర్బంగా సీనియర్ జర్నలిస్టులను సత్కరిస్తామన్నారు. ఏపీడబ్ల్యుజేఎఫ్ నగర అధ్యక్షులు పి.నారాయణ్ మాట్లాడుతూ ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా ఉగాది సంబరాలను వైశాఖి జలఉద్యానవనంలో నిర్వహిస్తున్నామని ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు తమ కుటుంబాలతో పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు.ఉదయముఅల్పాహారంనుంచి విందు భోజనంవరకూ ఆయా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు..ఈ సమావేశంలో ఏపీడబ్ల్యుజేఎఫ్ నగర కార్యదర్శి ఎస్. అనురాధ,ఏపీ బిజేఏ నగర అధ్యక్షుడు ఈరోతి ఈశ్వరరావు, నేషనల్ కౌన్సిల్ సభ్యులు జి. శ్రీనివాస్,కోశాధికారి బి. సీతారామమూర్తి, ఉపాధ్యక్షులు బండారు శివ ప్రసాద్, కే. మురళీకృష్ణ, ఇతర ప్రతినిధులు చింతా ప్రభాకర్, ఎం. ఏ. ఎన్. పాత్రుడు, కామన్న, ఎం. వి.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.