విశాఖలో 26 నుంచి చేనేత వస్త్ర ప్రదర్శన..


Ens Balu
9
Visakhapatnam
2022-03-25 12:06:27

మహా విశాఖనగరంలోని 26వ తేదీ నుంచి జిల్లా హ్యాండ్లూమ్ ఎక్స్ పో- 2022  చేనేత వస్త్ర ప్రదర్శన అమ్మకాలు ప్రారంభిస్తున్నట్టు  విజయవాడ చేనేత సేవా కేంద్రం విశాఖలోని మీడియాకి  ప్రకటన విడుదల చేసింది.  జీవీఎంసీ కమిషనర్ లక్ష్మిశ శనివారం ఉదయం గం.11-00 లకు ఈ ప్రదర్శనను ప్రారంభిస్తారని తెలియజేశారు. ఎగ్జిబిషన్ 26 వ తేదీ నుండి 30 వ తేదీ వరకు ఉదయం గం. 11-00 నుండి రాత్రి గం.9-00 ల వరకు సెలవు రోజు లతో సహా అన్ని రోజులు ఉంటుందని పేర్కొన్నారు.. డైమండ్ పార్క్ దగ్గర గల శంకర మఠం ఎదురుగా భక్త మార్కండేయ పద్మశాలి భవనం లో ఏర్పాటు చేస్తున్నట్టు తెలియజేశారు. చేనేత యొక్క విశిష్టత తెలిసేలా చేయడం, చేనేత కార్మికులకు ప్రోత్సాహాన్ని అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ఎగ్జిబిషన్ లో చీరలు డ్రెస్ మెటీరియల్ ఖద్దరు వస్త్రాలు ఇతర చేనేత వస్త్రాలు దుస్తులు ఉంటాయని, ప్రజలందరూ విచ్చేసి కొనుగోలు చేసి చేనేతను ప్రోత్సహించవలసిన దిగా చేనేత సేవాకేంద్రం నిర్వాహకులు కోరుతున్నారు.