ఫ్లోటింగ్ జెట్టీకోసం స్థలం గుర్తింపు..
Ens Balu
8
Chintapalli
2022-03-26 03:43:40
విజయగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని చింతపల్లిలో ప్రభుత్వం నిర్మించ తలపె ట్టిన ఫ్లోటింగ్ జెట్టీ పనులు వేగం పుంజుకున్నట్టు కనిపిపస్తున్నాయి. ఈ మేరకు శుక్రవారం మత్స్యశాఖ అదనపు సంచాలకులు ఎన్.నిర్మలకుమారి ఆధ్వర్యంలో తహశీల్దార్ క్రిష్ణమూర్తి మరియు రెవిన్యూ సిబ్బంది స్థలాన్ని గుర్తించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జెట్టీ నిర్మాణం కోసం ఆరు ఎకరాల స్థలాన్ని గుర్తించి వాటిని జియో ట్యాగింగ్ చేసి వివరాలను రాష్ట్ర కార్యాలయానికి నివేదించారు. ఇటీవలే ఈ ప్రాంతంలో ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణం కోసం కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో పరిశీలన కూడా జరిగింది. ఆ తరువాత దాని నిర్మాణ విషషయంలో ప్రభుత్వం ముందడుగు వేయడంతో పురోగతిని సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు బర్రి చినప్పన్న, మత్స్యశాఖ ఏడి కిరణ్ కుమార్, ఎఫ్ డిఓ చాందిని, గ్రామీణ మత్స్యసహాయకులు, మత్స్యకార సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.