ఆ తప్పుడు వాయిస్ మెసేజ్ నమ్మవద్దు..
Ens Balu
17
Kakinada
2022-03-26 14:45:18
సామాజిక మాద్యమాల్లో ఏఎన్ఎం లకు ఇన్ సర్వీసు క్రింద ఇచ్చే జిఎన్ఎం స్టాఫ్ నర్సు శిక్షణ విషయంలో అభ్యర్ధులను తప్పుదేవ పట్టించే విధంగా ట్రోల్ అవుతున్న తప్పుడు వాయిస్ మెసేజ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని తూర్పుగోదావరి జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారిణి డా.బొడ్డేపల్లి మీనాక్షి సూచించారు. ఈ మేరకు ఆమె ఈఎన్ఎస్ తో శనివారం ప్రత్యేకంగా మాట్లాడారు. ఏఎన్ఎం నుంచి జిఎన్ఎం శిక్షణకు వెళ్లేవారందకా శిక్షణ తరువాత ఉద్యోగాలు రావని, వారంతా కాంట్రాక్టు విధానంలోనే ఉద్యోగాలు చేయాలనే విషయాన్ని ఉటంకిస్తూ ఒక మహిళ వాయిస్ మెసేజ్ జిల్లా వ్యాప్తంగా సామాజిక మాద్యమాల్లో ట్రోల్ అవుతున్న విషయం తమ ద్రుష్టికి వచ్చిందన్నారు. అయితే అలాంటి వాటిని అభ్యర్ధులు ఎవరూ నమ్మవద్దని, ఇన్ సర్వీస్ ఏఎన్ఎంలకు జిఎన్ఎం స్టాఫ్ శిక్షణ విషయంలో ప్రభుత్వ నిబంధనలను మాత్రమే అమలు చేస్తామని డిఎంహెచ్ఓ సూచిస్తున్నారు. ఎరికైనా ఇలాంటి తప్పుడు మెసేజ్ లు వస్తే జిల్లా కార్యాలయంలో తమను సంప్రదించాలి తప్పితే ఎవరో ఊరు పేరు లేని వ్యక్తులు పెట్టే తప్పుడు వాయిస్ మెసేజ్ లను నమ్మవద్దని, ఒక వేళ అలాంటి నకిలీ మెసేజ్ లు విని భయపడటం ద్వారా ఇబ్బందులు పడతారని మీడియా ద్వారా డిఎంహెచ్ఓ డా.బొడ్డేపల్లి మీనాక్షి ఇన్ సర్వీస్ స్టాఫ్ నర్స్ శిక్షణకు వెళ్లే ఏఎన్ఎంలకు సూచించారు.