భక్తుల కొంగు బంగారం శ్రీ కనకమహాలక్ష్మీ..


Ens Balu
5
Visakhapatnam
2022-03-27 13:53:06

భక్తుల కొరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా శ్రీకనక మహాలక్ష్మీ అమ్మవారు పేరుగాంచారని విశాఖ పోర్టు ట్రస్టు చైర్మన్‌ కె.రామ్మోహన్‌రావు అన్నారు. ఆదివారం శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి ఆలయంలో జీవీఎంసీ డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ రెవెన్యూ (డిసిఆర్‌) పి.నల్లనయ్య రూపొందించిన భక్తిపాటల సిడీని రామ్మోహన్‌రావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమ్మవార్లు మహిమలను ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఇటువంటి సిడీలు రూపొందించడం అభినందనీయమన్నారు. నగర మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారి మాట్లాడుతూ రాష్ట్రంలో పలు దేవాలయాల చరిత్రలను తెలియజేసే విధంగా నల్లనయ్య  భక్తి గీతాల సీడిలను తీసుకురావడం ప్రశంసనీయమన్నారు. ఒక వైపు విధులు నిర్వహిస్తునే మరో వైపు ఆధ్యాత్మిక భక్తి భావాల్లో ముందుకు సాగడం చాలా అభినందనీయమని నల్లనయ్య ప్రతిభను కొనియాడారు. విశిష్ట అతిథిగా హాజరైన అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ఇప్పటికే శ్రీకూర్మం,రామతీర్థం, సింహచలం పుణ్యక్షేత్రాలకు సంబంధించి చరిత్రలను భక్తి గీతాల రూపంలో అనువదించిన నల్లనయ్య ఇప్పుడు కనకమహాలక్ష్మీ  ఆలయ చరిత్రను తెలియజేసే విధంగా సిడీని తయారు చేయడం ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో గీత రచయిత పల్లి లక్ష్మీ,  శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్ధానం చైరపర్సన్‌ కొల్లి సింహాచలం, ట్రస్టీలు వంకయాల మూరుతి ప్రసాద్‌, బుద్దల అనురాధ, మాతా రికార్డింగ్‌ చైర్మన్‌ పల్లి నాగభూషన్‌, కలియుగ బిరుదుకాంతిడు బిన్నాల నరసింహమూర్తి, గాయకులు శాంతి వేణుమాధవ్‌, శ్రీలత, సంగీతం వేణుమాధవ్‌చ సిఎస్‌ఎస్‌ మురళీ పాల్గొన్నారు.