డా.బీఆర్ అంబేద్కర్ గురుకులాల్లో ప్రవేశాలకు ఆహ్వానం..
Ens Balu
4
Vizianagaram
2022-03-28 13:25:54
విజయనగరం జిల్లాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి, ఇంటర్‌లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి కోరారు. ఈ ప్రవేశాలకు సంబంధించిన కరపత్రాలను సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి జిల్లాలోని 10 గురుకులాల్లో ప్రవేశాల కోసం ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఐదో తరగతిలో, పదో తరగతి విద్యార్థులు ఇంటర్‌లో ప్రవేశానికి, ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అంబేద్కర్ గురుకుల విద్యాలయాలు బాలురకు చీపురుపల్లి, నెల్లిమర్ల, వియ్యంపేట, వేపాడ, కొమరాడ, గరుగుబిల్లి, బాలికలకోసం బాడంగి, కొప్పెర్ల, సాలూరు, పార్వతీపురంలో ఉన్నాయని తెలిపారు. వీటిలో ప్రవేశాలకు వచ్చేనెల 24న ప్రవేశపరీక్ష జరుగుతుందని తెలిపారు. వివరాలకోసం సమీపంలోని అంబేద్కర్ గురుకుల పాఠశాల, నెట్ సెంటర్ లేదా ఫోన్ నెంబర్ 8333033434 కు సంప్రదించవచ్చని సూచించారు. ఈ కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమంలో గురుకుల విద్యాలయాల జిల్లా సమన్వయాధికారి బలగ చంద్రవతి, సిబ్బంది పాల్గొన్నారు.