గడువులోగా ఎన్ఏడీ ఫ్లైఓవర్ పనులు పూర్తికావాలి..
                
                
                
                
                
                
                    
                    
                        
                            
                            
                                
Ens Balu
                                 4
                            
                         
                        
                            
ఎన్ఏడీ ఫ్లై ఓవర్
                            2020-09-16 20:23:54
                        
                     
                    
                 
                
                    విఎంఆర్డిఏ చేపట్టిన ఎన్ఏడి ఫ్లై-ఓవర్ ( ఫై వoతేన) నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని మెట్రోపాలిటన్ కమిషనర్  పి.కోటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఈమేరకు అదనపు కమిషనర్ మనజిర్ జీలని సామూన్ తో కలిసి ఫ్లై ఓవర్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడు తూ, ప్రణాళిక ప్రకారం ఈ నెల సెప్టెంబర్ 15 లోపు గోపాలపట్నం వైపు నుంచి వచ్చే ఫ్లైఓవర్ పనులను పూర్తి చెయ్యవలసి ఉండగా నిర్ణీత సమయానికే పనులు పూర్తయ్యాయన్నారు. అదేవిధంగా అక్టోబర్ 15 లోపు మర్రిపాలెం వైపు వెళ్లే ఫ్లైఓవర్ పనులను పూర్తి చెయ్యాలని అధికారులకు ఆదేశించారు. నవంబర్ 15 లోపు ఎన్ఎస్టీఎల్ నుంచి ఎయిర్పోర్ట్ వైపు వెళ్లే రహదారి పనులు పూర్తి చేసి, అప్పర్ రోటరీ మొత్తాన్ని వినియోగంలోకి తీసుకొని రావాలని చీఫ్ ఇంజనీర్ కె.రామ్మోహ నరావుని ఆదేశించారు. వంతెన కాంట్రాక్టర్ తో సంప్రదింపులు జరిపి అనుకున్న తేదీల్లోగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్  ఉమా శంకర్ , జనరల్ మేనేజర్  క్రిహ్ష్ణమోహన్, ఈపిసి కాంట్రాక్టర్ ప్రతినిధి తదితరులు పాల్గొన్నారు.