విశాఖ జిల్లాలో గ్రూప్3  విజేతలకు పోస్టింగులు ఇవ్వాలి..
                
                
                
                
                
                
                    
                    
                        
                            
                            
                                
Ens Balu
                                 5
                            
                         
                        
                            
Visakhapatnam
                            2020-09-16 20:25:42
                        
                     
                    
                 
                
                    ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 3(పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-4) పరీక్షల్లో  ఉత్తీర్ణత సాధించిన జిల్లాలోని పలువురు అభ్యర్థులు పోస్టింగ్ కోసం నిరీక్షిస్తున్నారు. విశాఖలో బుధవారం చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ,  2018 డిసెంబర్‌లో గ్రూప్ 3 నోటిఫికేషన్ వెలువడడం,  2019 ఏప్రిల్  లో ప్రాథమిక పరీక్షను ప్రభుత్వం నిర్వహించిందన్నారు.  ఆగస్టు 2019లో మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించి,  ఫలితాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేశారన్నారు.  సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆగస్టు 10న నగరంలోని డీపీఓ కార్యాలయంలో నిర్వహించారని చెప్పారు. ఇతర జిల్లాల్లో అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వడం, వారు  మూడు నెలలకు పైగా జీతాలు కూడా తీసుకున్నారని, విశాఖజిల్లాలో  మాత్రం పోస్టింగ్ కోసం ఎదురు చూస్తునే ఉన్నామన్నారు.  తాము  ఇప్పటికే ఏడు నెలలుగా పైగా సర్వీసును కోల్పోయామని, ఈ విషయమై జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశామని, ఇప్పటికైనా తమకు పోస్టింగు ఇప్పించాలని కోరారు.