ఓజోన్ పొర కాపాడే బాధ్యత ప్రతీ ఒక్కరిది..


Ens Balu
3
Visakhapatnam
2020-09-16 20:36:47

ఓజోన్ పొరను కాపాడేందుకు ప్రతీ ఒక్కరూ విధిగా మొక్కలు పెంచాలని గాయత్రీ విద్యాపరిషత్‌ ఉపాధ్యక్షులు డి.దక్షిణామూర్తి పిలుపునిచ్చారు. ప్రపంచ ఓజోన్‌ ‌దినోత్సవాన్నిపురష్కరించుకొని గాయత్రీ విద్యాపరిషత్‌ ‌డిగ్రీ, పీజీ కళాశాలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతీ ఏటా ఓజోన్ దినోత్సవా న్ని క్రమం తప్పకుండా నిర్వహించి ప్రాంగణంలో మొక్కలు నాటతమాన్నారు. అంతేకుండా వాటిని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పెంచుతామని కూడా వివరించారు.  . పర్యావరణ హితమైన కార్యక్రమాలు తాము నిత్యం నిర్వహిస్తామని ఈ సందర్భంగా చెప్పారు. కార్యక్రమంలో జీవీపీ , ఇతర యాజమాన్య సభ్యులు డీవీఎస్‌ ‌కామేశ్వర రావు, ఆచార్య ఎ.నాగేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య ఎస్‌.‌రజని, యూజీ డైరక్టర్‌ ఆచార్య ఐ.ఎస్‌.‌పల్లవి, పర్యావరణ విభాగాధిపతి డాక్టర్‌ ‌జి.లక్ష్మీ నారాయణ పర్యవేక్షణలో వాలంటీర్లు వ్యక్తుల మధ్య దూరం పాటిస్తూ పాల్గొన్నారు.