ప్రజాసేవకు ట్రస్టులు ముందుకి రావాలి..


Ens Balu
7
Tirupati
2022-04-19 12:46:26

వసంత లక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ ను కలసి లక్ష మంది అంగన్వాడీ పిల్లల కోసం ఆల్బెండజోల్, ఎ విటమిన్ టాబ్లెట్ లు అందించిన సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి ట్రస్ట్ నిర్వహాకులను అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజాసేవకు స్వచ్చంద సంస్థలు, ఛారిటబుల్ ట్రస్టులు ముందుకి రావాలన్నారు. అనంతరం అక్కడే ఉన్న జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారిణి జయ లక్ష్మి కి సూచిస్తూ జిల్లా లోని 34 మండలాల్లో గల 2358 అంగన్వాడీ కేంద్రాలలోని 6 నెలలు నుండి 3 సం. ల వయసు గల 101126 మంది పిల్లలకు నులిపురుగుల నివారణ కోసం, ఎ విటమిన్ అందించడానికి ముందస్తుగా తప్పనిసరి వైద్య అధికారులను సంప్రదించి వారి సూచనల మేరకు శిక్షణ ఇచ్చి అల్బెండజోల్, ఎ విటమిన్ మోతాదు మేరకు అంగన్వాడీ పిల్లలకు పూర్తి స్థాయిలో త్వరలో అందించే ఏర్పాట్లు చేయాలని సూచించారు.  ట్రస్ట్ ప్రతినిధి వసంత లక్ష్మి, మెంబర్ లు రవి కుమార్, ట్రస్ట్ సెంట్రల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.