అమరావతికి పయనమైన సీఎం జగన్
Ens Balu
5
Visakhapatnam
2022-04-19 13:10:17
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ పర్యటన ముగించుకొని మంగళవారం సాయంత్రం విశాఖపట్టణం విమానాశ్రయం నుంచి అమరావతికి తిరుగు పయనమయ్యారు. ఉదయం నగరానికి చేరుకున్న ఆయన ముందుగా స్థానిక నేతలను కలిశారు. అనంతరం రుషికొండలోని రిసార్ట్ వెల్‌నెస్ సెంటర్ కు చేరుకొని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో కాసేపు భేటీ అయ్యారు. భేటీ ముగిసన తదుపరి మంగళవారం సాయంత్రం 3.15 గంటలకు విమానంలో అమరావతికి తిరుగుపయనమయ్యారు. జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున, పోలీస్ కమిషనర్ శ్రీకాంత్, జాయింట్ కలెక్టర్ విశ్వనాథన్ ఎయిర్ పోర్టుకు చేరుకొని ముఖ్యమంత్రికి వీడ్కోలు పలికారు.