ప్రతి ఒక్కరికీ అందుబాటులో వైద్యం
Ens Balu
4
Anakapalle
2022-04-19 13:18:42
రాష్ట్రంలో అందరికీ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకు రావడమే లక్ష్య్రగా ముఖ్యమం త్రి జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాధ్ పేర్కోన్నారు. మంగళవారం అనకాపల్లి జిల్లా కేంద్రంలోని ఎన్.టి.ఆర్.స్టేడియంలో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంపును ఆయన ప్రారంబించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రతి మండలానికి ఒక 108 అంబులెన్స్లో పాటు 101 సర్వీసుల ద్వారా రోగులకు సకాలంలో వైద్యసేవలు అందజేయడం జరుగుతుందన్నారు. ప్రతి గ్రామంలో వెల్ నెస్ సెంటర్లను ప్రారంభించారని, 2,500 వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోనికి తీసుకు వచ్చారని తెలిపారు. జిల్లా కలెక్టర్ రవి సుభాష్ మాట్లాడుతూ మెగా మెడికల్ క్యాంపులో 200 రకాల వ్యాధులకు సంబంధించిన రోగులకు ఉచితంగా చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. ఆరోగ్యశ్రీ కార్డులు లేని వారు తక్షణమే తమ పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ క్యాంపులో వైద్య నిపుణులు, అన్ని రకముల స్పెషలిస్ట్ వైద్య నిపుణులు, అవసరమైన పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. అవసరమైతే తగిన చికిత్స కొరకు సంబంధిత వైద్యశాలలో చికిత్స అందిస్తారన్నారు. పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బి.వి.సత్యవంతి మాట్లాడుతూ ఆరోగ్యమే మహా భాగ్యమని పెద్దలు చెప్పారని, అందరూ ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలని పిలుపు నిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మెగా హెల్త్ మేళాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్.పి. వైస్ ఛైర్ పర్సన్ బి.వి. సత్యవతి, ఎంపిపీ గొర్లిసూరిబాబు, డాక్టర్ విష్ణుమూర్తి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ విజయలక్ష్మి, డా.మధుసూధన ప్రసాద్, స్పెషలిస్ట్ వైద్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.