పరిశుభ్ర నగరంగా రాజమహేంద్రం నగరాన్ని తీర్చిదిద్దడానికి అన్ని వర్గాల ప్రజల సహకారం అవసరమని నగర పాలక సంస్థ కమీషనర్ కె దినేష్ కుమార్ అన్నారు. ఈ మేరకు మంగళవారం రాత్రి స్వీపింగ్ యంత్రాల పనితీరు ఆకస్మిక తనిఖీ చేశారు. సోమవారం అర్ధరాత్రి నగరంలోని కూడళ్ళ లో స్వీపింగ్ యంత్రాల పనితీరుని ఆకస్మిక తనిఖీ చేశారు. స్థానిక ఆర్ టి సి కాంప్లెక్స్ ప్రాంతం లో స్వీపింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారు. నగరపౌరులకు ధూళి ,దుమ్ము వల్ల ఇబ్బంది రాకుండా ప్రతి రోజూ అర్ధరాత్రి 12 గంటల తర్వాత వీటిని ప్రధాన కూడళ్లు, రద్దీ తగ్గిన ప్రాంతాల్లో తిప్పి రహదారులను శుభ్రం చేయిస్తున్నామన్నారు. నిర్దేశించిన సిబ్బంది క్షేత్ర స్థాయి లో పనితీరు విషయం లో అలసత్వం ప్రదర్శిస్తే క్షమించేది లేదన్నారు. నగర పరిశుభ్రత విషయం లో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి నట్టు కమీషనర్ ఈ సందర్భంగా వివరించారు.