తూర్పుగోదావరి జిల్లా లో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయము తో పనిచెయ్యాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఆదిత్య బిర్లా గ్రూప్ ఇండియా.. గ్రాసిమ్ ఇండస్ట్రీ ప్రైవేట్ కంపెనీ ఆవరణలో అధికారులతో ఏఎస్ఎల్ (ముందస్తు భద్రతా ఏర్పాట్ల పై) సమీక్షించారు. జిల్లా కలెక్టర్ డా.కె.మాధవిలత, ఎస్పీ ఐశ్వర్య రాస్తోగి లతో కూడిన అధికారుల బృందం తో కూడా పర్యటించారు. నూతన జిల్లా ఏర్పాటు తర్వాత సీఎం పర్యటన ను విజయవంతం చెయ్యడంలో ముందస్తు ఏర్పాట్లపై అధికారులకు, పోలీస్ సిబ్బంది కి సరైన మార్గదర్శకాలు జారీ చేసినట్లు కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. సుమారు రెండు గంటల పాటు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ప్రతి ఒక్క అంశాన్ని పరిశీలన చేసి రూట్ మ్యాప్ పై చేర్చించారు. ఎస్పీ రాస్తోగి భద్రత సిబ్బంది కిదిశా నిర్దేశం చేశారు. హెలిప్యాడ్, కంపెనీ ఆవరణలో ప్రారంభించనున్న యూనిట్స్, బహిరంగ సభ, స్టేజి ఏర్పాటు, వి ఐ పి, మీడియా, పబ్లిక్ గ్యాలరీ, గ్రీన్ రూమ్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, డిజిటల్ స్క్రీన్, వి ఐ పి, అధికారులు, ఆహ్వానితుల ప్రవేశ మార్గలు తదితర ఏర్పాట్లు పరిశీలించారు. సీఎం భద్రత అధికారి డిఎస్పీ (ఇంటిలజెన్సీ ) రాజారెడ్డి, కంపెనీ వైస్ చైర్మన్ అర్జీ కృష్ణన్, ఆర్డివో లు ఎస్. మల్లిబాబు, ఏ. చైత్ర వర్షిణి, ఇతర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.