మరింత మెరుగ్గా సచివాలయ వ్యవస్థ..


Ens Balu
1
Kakinada
2022-04-19 14:03:52

వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు చెప్పారు. పుర పరిపాలన శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు సచివాలయాల నోడల్ ఆఫీసర్లు ప్రత్యేక అధికారులతో మంగళవారం సాయంత్రం కార్పొరేషన్ కార్యాలయంలో ఈ అంశంపై సమీక్షించారు. అనంతరం కమిషనర్  విలేకరులతో మాట్లాడుతూ, కాకినాడ లోని 100 సచివాలయాలకు సంబంధించి 50 మంది నోడల్ అధికారులు, వీరిపై ప్రత్యేక అధికారులు ఉన్నారని చెప్పారు. ఇకపై  వారంలో కనీసం రెండు సార్లు నోడల్ అధికారులు వారి పరిధిలోని సచివాలయాన్ని సందర్శించి అక్కడ ప్రజలకు అందుతున్న సేవలను పర్యవేక్షిస్తారన్నారు. పారిశుధ్యం,మంచినీరు వీధి దీపాల నిర్వహణ,అనధికార కట్టడాలు,ఆక్రమణలు వంటి అన్ని సమస్యలు స్థానికంగా సచివాలయాల పర్యవేక్షణలోనే పరిష్కారమయ్యేలా  వ్యవస్థను పటిష్టవంతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సచివాలయంలో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలు, ఇబ్బందులను తమ దృష్టికి తీసుకువచ్చి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం ద్వారా సచివాలయ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా నోడల్ అధికారులు దృష్టి పెట్టాలన్నారు. ఇకపై వారానికి రెండు సార్లు సచివాలయం సందర్శించి వాటి వివరాలను తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. సమావేశంలో కార్పొరేషన్  కార్యదర్శి ఏసుబాబు, మేనేజర్ కర్రి సత్యనారాయణ, ఎమ్ హెచ్ వో డాక్టర్ పృద్వి చరణ్, టి పి ఆర్ ఓ కృష్ణ మోహన్, వివిధ విభాగాల అధికారులు, నోడల్ అధికారులు పాల్గొన్నారు.