పన్ను రిబేటు సద్వినియోగం చేసుకోండి..
Ens Balu
2
Kakinada
2022-04-19 14:07:22
కాకినాడ నగర పరిధిలోని ప్రజలు 2022- 23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఒకేసారి పన్ను చెల్లించిన వారికి ప్రభుత్వం కల్పించిన 5 శాతం రిబేటు ను పన్ను చెల్లింపుదారులు సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నరసింహారావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 30వ తేదీ వరకు రిబేట్ పై పన్ను చెల్లించే అవకాశం ఉంటుందన్నారు. గత ఏడాది పన్ను రిబేటు ద్వారా రూ 10.50 కోట్లు వసూలు కాగా . ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు నాలుగున్నర కోట్ల రూపాయలు వసూలైందన్నారు. పాత పన్ను బకాయి ని మొత్తం పెనాల్టీ తో సహా చెల్లించిన వారికి మాత్రమే ప్రస్తుత పన్ను పై ఐదు శాతం రిబేటు వర్తిస్తుందన్నారు. ప్రజలు చెల్లించే పన్నుల ద్వారానే మౌలిక వసతుల కల్పన సాధ్యమని , అందువల్ల ప్రజలు పన్ను రిబేటు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎటువంటి పెనాల్టీ లేకుండా రిబేటు పొందే అవకాశాన్ని వినియోగించుకోవాలని కమిషనర్ కోరారు. ఈ ఏడాది కూడా రూ 10 కోట్ల కు పైగా వరకు రాయితీపై పన్ను వసూలు అయ్యే అవకాశం ఉందని కమిషనర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.