తిరుపతిలోని సర్వదర్శనం టోకెన్ జారీ కౌంటర్లను మంగళవారం సాయంత్రం టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలోని అధికారుల బృందం పరిశీలించింది. సర్వద ర్శనం టైంస్లాట్ టోకెన్లు విధానం పునరుద్ధరించాలని చేయాలని టిటిడి యోచిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా కౌంటర్ల వద్ద భక్తుల సౌకర్యార్థం మరింత మెరుగ్గా చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులు చర్చించారు. అన్నప్రసాదాలు అందించేందుకు, భక్తులు మరుగుదొడ్లకు వెళ్లేందుకు వీలుగా క్యూలైన్లలో మార్పులు చేయాలని నిర్ణయించారు. ముందుగా అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్ వద్దగల కౌంటర్లను పరిశీలించారు. ఆ తరువాత శ్రీనివాసం యాత్రికుల వసతి సముదాయం, గోవిందరాజస్వామి సత్రాల వద్దగల కౌంటర్లను అధికారులు పరిశీలించారు. సిఈ వెంట ఎస్ఇ-2 జగదీశ్వర్ రెడ్డి, ఐటి విభాగాధిపతి శేషారెడ్డి, విజిఓ మనోహర్ ఇతర ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు.