గిరిజన సంస్కృతి పరిశోధన, శిక్షణ సంస్థ గిరిజనులకు అత్యంత చేరువగా కార్యక్రమాలు నిర్వహిచాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమశాఖ సంచాలకులు గంధం చంద్రుడు సిబ్బందిని ఆదేశించారు. బుధవారం విశాఖలోని రుషికొండ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజన భాషలు, గిరిజన నృత్యాలు, కళలు, పరిశోధన శిక్షణలు మీద సమీక్షించారు. గిరిజన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు, గిరిజన ప్రాంతములో పనిచేసే ఉద్యోగులకు, గిరిజన యువతి యువకులకు గిరిజన చట్టాలు, హక్కులు మరియు ప్రభుత్వాలు గిరిజన ప్రజలకు అందిస్తున్న పథకాలు పైన అవగహన తరగతులు నిర్వహించాలన్నారు. వారిని చైత్యనవంతులను చేసి క్షేత్రస్థాయిలో గిరిజన ప్రాంత అభివృధికి దోహదపడే విధంగా అవగహన తరగతులు ఉండాలని చూసించారు.ఇంతే కాకుండ గిరిజన సంస్కృతి పరిశోధన మరియు శిక్షణ అవసరాలను గుర్తించి సంబందిత ప్రతి పదనలు తయారి చేసి సంవత్సరిక కార్యాచరణ రూపోందించాలని ఆదేశించారు. అంతే కాకుండా ఈ కార్యాలయం భవవ సముదాయాన్ని కూడా పూర్తి స్థాయి లో వినియోగించు కోవాలని సూచించారు. గిరిజన ప్రాతములో ఉపాధ్యాయులకు ఆంగ్లం, మాతృ బాషా ఆధారంగా బహు బాషా విధానం బోదించేటట్టు శిక్షణ తరగతులు నిర్వహించాలని, ఈ శిక్షణ తరగతులు విద్య శాఖ వారితో సమన్వయం చేసుకొని నిర్వహించాలని అన్నారు. గిరిజన ప్రాంతంలో, పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు బోధన మేలుకవులు పైన శిక్షణా తరగతులు నిర్వహించాలని తద్వారా గిరిజన విద్యార్థులకు పాఠ్యాంశాలు త్వరితగతిన అర్ధమయ్యే విధముగా ప్రతిపాదనలు రుపాదించాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యలయం నిర్మాణం 2వ దశ పనులకు సంబందించి అన్ని ఏర్పాటులను త్వరితగతిన పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రములో గిరిజన సంక్షేమశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజు, డిప్యూటీ ఇంజనీర్ సిమ్మన్న. గిరిజన సంస్కృతి పరిశోధన,శిక్షణ సంస్థ ఆచార్యులు డా. ఎన్. శ్రీనివాస్, వి. సునీల్, ఎన్. సీతారామయ్య, కే యస్. వెంకటేశ్వర రావు, కే.జైరాం తదితరులు పాల్గొన్నారు.