పనులు సకాలంలో పూర్తి చేయండి అని శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు పేర్కొన్నారు. నగరపాలక సంస్థ లో గల వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సంబంధిత ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు తో మున్సిపల్ కమిషనర్ బుధ వారం మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో నేటికీ నిర్వహించిన పనులపై ఆరా తీసారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ కాంట్రాక్టర్లు, టెండర్ల నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలన్నారు. కేటాయించిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయవలసిందిగా సూచించారు. ఈ సమావేశానికి ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.