భూ పునః సర్వే పై దృష్టి సారించాలి
Ens Balu
5
మన్యం
2022-04-21 08:45:07
భూ పునః సర్వే వలన భూ సమస్యలు నివారించ వచ్చని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జి. సాయి ప్రసాద్ అన్నారు. భూ పునః సర్వే కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లతో గురువారం భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జి. సాయి ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామ స్థాయి రెవిన్యూ అధికారులను మ్యాపింగ్ చేయాలని ఆయన సూచించారు. సర్వే, రెవిన్యూ అంశాలపై దృష్టి సారించాలని ఆయన పేర్కొన్నారు. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యదర్శి ఎం.బాబు మాట్లాడుతూ గ్రామ సచివాలయం పరిధిలో నీటి తీరువా వసూలు చేయాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా రెవిన్యూ అధికారి జల్లేపల్లి వెంకట రావు, సర్వే సహాయ సంచాలకులు పాల్గొన్నారు.