ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ పథకం కింద శుక్రవారం సంఘాల సభ్యుల ఖాతాలకు నిధులు జమ చేయనుంది. పార్వతిపురం మన్యం జిల్లాలో 20,055 స్వయం సహాయక సంఘాలలోని 2,30,675 మంది సభ్యులకు రూ.13.68 కోట్లు నిధులు జమ కానుంది. జిల్లాలో మొదటి విడతలో 2019 - 20 సంవత్సరానికి16,695 సంఘాల్లోని 1,92,694 మంది సభ్యులకు రూ.11.05 కోట్లు, 2020 - 21 ఆర్థిక సంవత్సరంలో 18,868 సంఘాలలోని 2,15,165 మంది సభ్యులకు రూ.10.66 కోట్లు చెల్లించడం జరిగింది. మూడు సంవత్సరాల్లో 20,055 మహిళా సంఘాలలోని 2,30,675 సభ్యులకు మొత్తం రూ.35.39 కోట్లు విడుదల చేయడం జరిగింది. ఈ మేరకు వైఎస్సార్ క్రాంతి పథం ఏపీడి సత్యం నాయుడు గురు వారం ఒక ప్రకటనలో వివరాలు తెలిపారు.