భూ సర్వే సత్వరమే పూర్తి చేయాలి..
Ens Balu
6
Srikakulam
2022-04-21 08:54:30
భూ రీ సర్వే త్వరితగతిన పూర్తి చేయాలని సిసిఎల్ఎ కమీషనర్ సాయి ప్రసాద్ పేర్కొన్నారు. జగనన్న భూ సర్వే, మ్యుటేషన్లు 22ఎల పై జిల్లా కలెక్టర్లు, జిల్లా జాయింట్ కలెక్టర్లు తో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్ధేశించిన జగనన్న భూ సర్వే పై నిర్ణయించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తిచేయాలని తెలిపారు. మ్యుటేషన్లుకు సంబంధించి అర్జీలు తిరస్కరించకుండా ప్రభుత్వం జారీ చేసిన సూచనలు ప్రకారం చేయాలన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి జిల్లా కలెక్టర్ శ్రీకేష్ మాట్లాడుతూ జిల్లాలో భూ సర్వే జరుగుతోందని 29 పూర్తి అయ్యాయని మిగిలినవి త్వరిత గతిన పూర్తిచేయడం జరుగుతుందన్నారు. గతంలో డ్రోన్ల ద్వారా 10 నుండి 12 కి.మీ వరకు సర్వే జరిగేదని, అయితే సాంకేతిక లోపాలు కారణంగా ప్రస్తుతం 6 కి.మీ వరకే సర్వే నిర్వహించడం జరుగుతుందని, దీనివలన సర్వేలో జాప్యం జరిగే అవకాశం ఉన్నందున ఆ సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ కోరారు.ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. విజయ సునీత, డిఆర్ఓ ఎం.రాజేశ్వరి , సర్వే అండ్ ల్యాండ్ రికార్డుల శాఖ ఎడి ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.