రేపు వై.యస్.ఆర్.సున్నావడ్డీ ప్రారంభం
Ens Balu
3
Srikakulam
2022-04-21 13:47:19
శ్రీకాకుళం జిల్లాలో నేడు వై.యస్.ఆర్.సున్నావడ్డీ 3వ సంవత్సరం ప్రారంభోత్సవ కార్య క్రమం జరగనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు బి.శాంతిశ్రీ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన జారీచేసారు. ఏప్రిల్ 22న ఉదయం 11.00గం.లకు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి తొలుత ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, జిల్లాలో స్థానిక బాపూజీ కళామందిర్ నందు ఉదయం 11.00గం.లకు ప్రారంభం కానుందని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారామ్, రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి డా. సీదిరి అప్పలరాజు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు , ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు తదితరులు హాజరుకానున్నట్లు ఆమె ఆ ప్రకటనలో వివరించారు.