వంశీక్రిష్ణ శ్రీనివాస్ కు ఘనంగా వీడ్కోలు
Ens Balu
3
Visakhapatnam
2022-04-21 14:08:47
విశాఖలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పునాది నుంచి నేటివరకు దాదాపు గా 7 సంవత్సారాలు వైసీపీ నగర అధ్యక్షులుగా అనేక పార్టీ కార్యక్రమాలలో నాకు వెన్నుదన్నుగా నిలిచిన వైసీపీ నాయకులకు, వైసీపీ అభిమానులకు, కార్యకర్తలకు, విశాఖ ప్రజలకు, మీడియా మిత్రులకు ఎమ్మెల్సీ వంశీక్రిష్ణ శ్రీనివాస్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈమేరకు గురువారం విశాఖలోని నగర పార్టీ కార్యాలయంలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కంపా హనోక్ అధ్యక్షతన వంశీ వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ, పార్టీలో అందరికీ పదవులు ఇవ్వాలనే సీఎం సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తపించి తనకు మంచి స్థానాన్ని కట్టబెట్టారని ఆనందం వ్యక్తం చేశారు. ఇన్నేళ్లుగా తనను ఎంతగానో ఆదరించారని..ఇకపై నగర అధ్యక్షునిగా వచ్చే వారినిక కూడా అదే రీతితో ఆదరించాలని కోరారు. అనంతరం వంశీని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు గజమాలలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గోలగాని హరి వెంకట కుమారి, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి దాడి విర భద్ర రావు , ఎమ్మెల్సీ వరుద కల్యాణి మాజీ మంత్రి పి బాల రాజు , రాష్ట్ర , జిల్లా వివిధ కార్పొరేషన్ చైర్మలు, జాన్ వెస్లీ , సుజాత సత్యనారయణ, మాజీ శాసన సభ్యులు తైనాల విజయకుమార్, ఎస్.ఎ రెహ్మాన్ , చెంగల వెంకట రావు , పార్టీ రాష్ట్ర అదనపు కార్యదర్శి రవిరెడ్డి, పార్టీ రాష్ట్ర , జిల్లా వివిధ కార్పొరేషన్ చైర్మలు జాన్ వెస్లీ , సుజాత సత్యనారాయణ, సుజాత నూక రాజు, డిప్యూటీ మేయర్లు కట్టమురి సతీష్ , జియాన్ని శ్రీధర్ , అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధి , జి.వి.ఎం.సి కార్పొరేటర్లు అప్పరావు , బిపిన్ కుమార్, రెయ్యి వెంకట రమణ , స్వాతి దాస్ , అల్లా లీలావతి , కామేశ్వరి , విల్లూరి భాస్కర్ రావు , కందుల నాగరాజు , రాష్ట్ర పార్టీ కార్యవర్గం సభ్యులు మొల్లి అప్పారావు , పేర్ల విజయ చంద్ర ,నగర జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటి సభ్యులు, రాష్ట్ర , జిల్లా వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, వార్డు అభ్యర్దులు, వార్డు అధ్యక్షులు, ముఖ్య నాయకులు, సీనియర్ నాయుకులు తదితరులు పాల్గొన్నారు.