పౌరసరఫరాల సంస్థలో ఉద్యోగాలకి దరఖాస్తులు ఆహ్వానం..


Ens Balu
3
Srikakulam
2020-09-17 20:52:34

శ్రీకాకుళం జిల్లా పౌర సరఫరాల సంస్ధలో  టెక్నికల్ అసిస్టెంట్స్ ( గ్రేడ్-౩ ), ఛార్టర్డు అకౌంటెంట్ పోస్టులకు అర్హత గల అభ్యర్ధుల నుండి దరఖాస్తులను కోరుతున్న ట్లు సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు  గురువారం ఒక ప్రకటన విడుదల చేసారు. పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ కార్యాలయంలో కాంట్రా క్ట్ పద్ధతిలో 9 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు, ఒక అకౌంటెంట్ పోస్టును భర్తీ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ పోస్టులకు అర్హత, ఆసక్తి గల అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన చెప్పారు. టెక్నికల్ అసిస్టెంట్స్ పోస్టునకు బియస్సీ  అగ్రీకల్చర్/హార్టీకల్చర్/డ్రైలాండ్ అగ్రికల్చర్ లలో ఉత్తీర్ణులై ఉండాలని లేదా బయో టెక్నాలజీ/బోటనీ స్పెషల్ సబ్జెక్టు కలిగిన సైన్స్ గ్రాడ్యుయేట్ గాని లేదా అగ్రికల్చర్ పాలిటెక్నిక్ / ఆర్గానిక్ పాలిటెక్నిక్ / లాండ్ ప్రొటెక్షన్ నందు డిప్లమో ఉత్తీర్ణులైన వారుగానీ  దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన చెప్పారు. సి.ఏ ఫైనల్ పూర్తి అయినవారు అకౌంటెంట్ పోస్టునకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆ ప్రకటనలో తెలిపారు. టెక్నికల్ అసిస్టెంటు పోస్టునకు నెలకు రూ.22 వేలు, అకౌంటెంట్ పోస్టునకు నెలకు రూ.45 వేలు జీతం ఉంటుందని, ఏడాది పాటు పనిచేయాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేసారు. అభ్యర్ధులను జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా ప్రతిభ, రోస్టర్, రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేయబడుతుందని, జనరల్ కేటగిరీకి 35 సంవత్సరాలు, రిజర్వడ్ కేటగిరీ అభ్యర్ధులు 40 సంవత్సరాలు లోపు ఉండాలని ఆయన పేర్కొన్నారు. అభ్యర్ధులు తమ దరఖాస్తుతో పాటు విద్యార్హతల ప్రతులు, ఇతర వివరాలతో ఈ నెల 23వ తేదీ సాయంత్రం 05.00గం.లలోగా dmskk.apscsc@gov.in మెయిల్ కు పంపాలని అన్నారు. ఇతర వివరాల కొరకు సంస్థ కంట్రోల్ రూమ్ ఫోన్ నెం. 7702003579, 9963479139, 9963479141 సంప్రదించాలని ఆయన ఆ ప్రకటనలో వివరించారు. నిర్ధేశిత దరఖాస్తును  www.apscscl.in వెబ్ సైట్ నందు డౌన్ లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు.