అల్లూరిజిల్లా హ్యాండ్ బుక్ ఆవిష్కరణ..


Ens Balu
8
Paderu
2022-04-21 14:59:22

స్టాటస్టిక్స్, ప్రణాళిక శాఖ ద్వారా రూపొందించిన అల్లూరి సీతారామరాజు జిల్లా హ్యాండ్ బుక్ ను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గురువారం ఆవిష్కరించారు.  కలెక్టర్ చాంబర్లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆవిష్కరించిన కలెక్టర్ మాట్లాడుతూ, కొత్తగా ఏర్పాటైన అల్లూరి సీతారామరాజు జిల్లా సమగ్ర సమాచారం తో పాటు జిల్లాలోని రెండు డివిజన్లకు సంబంధించిన 22 మండలాల 2011 జనాభా, గ్రామాలు, నివాసాలు, జిల్లా ఆర్థిక భౌగోళిక స్థితిగతులు, జిల్లాలోని అన్ని శాఖల డేటా, పర్యాటకం తదితర అంశాలతో హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ రూపొందించటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి, బి దయానిధి, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి కె. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.