నటనాభ్యాసంలో యోగా కూడా కీలకమే..
Ens Balu
10
Visakhapatnam
2022-04-21 15:14:57
నటనాభ్యాసంలో యోగభ్యాసం కూడా ఎంతో కీలకమని ప్రముఖ రంగస్థల రచయిత, నటులు., దర్శకులూ వేల వీధి నాటికల ప్రదర్శకులూ ప్రయోక్త భళ్లమూడి రామమూర్తి అభిప్రాయం వ్యక్తం చేశారు. విశాఖలో నట శిక్షణ లో పేరొందిన నవరస ధియేటర్ ఆర్ట్స్ అసోసియేషన్, రంగసాయి నాటక సంఘం సంయుక్తంగా జరుపుతున్న 45 రోజుల నట శిక్షణ వర్కు షాప్ లో భాగంగా భళ్లమూడి రామమూర్తి ప్రత్యేక తరగతిని నిర్వహించారు. టీఎస్సార్ కాంప్లెక్స్ లోని రంగసాయి నాటక గ్రంధాలయంలో నవరస మూర్తి, బాదంగీర్ సాయి నేతృత్వంలో ప్రత్యేకంగ నటనలో యోగ ప్రాధాన్యత అంశంపై ప్రత్యేక తరగతి నిర్వహించిన ఈ వర్క్ షాప్ లో భళ్లమూడి రామమూర్తి నట సాధనలొ యోగ అనువర్తింపుతో కూడిన విషయాలను ప్రస్తావించారు. ఏ ఆసన ప్రక్రియ ఏ హావ భావాలను వ్యక్తం చేస్తుందీ., ఎలాంటి ఆసన సందర్భంలోని ఏ కదలికలు నటనలో ఎలా ఉపయోగపడుతుంది వంటి అంశాలను ఆయన ప్రస్థావించారు. స్టోరీ టెల్లింగ్ లో దిగ్గజంగ పేరొందిన సీతా శ్రీనివాస్ నటనలో కధావగాహన- వ్యక్తీకరణ అంశంపై నట శిక్షణ లో వివరించారు. ముఖ్యంగ కథ అంటే ఏమిటీ కథ ప్రస్థావన., పాత్రల స్వభావం, అవగాహన చేసుకుని , ఆవాహన చేసుకుని ఆవిష్కరించడం వంటి అంశాలను ప్రస్థావించారు. వీటితో పాటూ భావావిష్కరణలో పాత్ర ఔచిత్యం ను మీరకుండ పాటించడం వంటి అంశాలను విశదీకరించారు. నట శిక్షణ శిబిరం ప్రధాన నిర్వాహకులూ., ముఖ్య శిక్షకులూ నవరస మూర్తి మాట్లాడుతూ జీవితంలో ఈ నటశిక్షణ వర్కు షాప్ చేకూర్చే ప్రయోజనాలను ప్రస్థావించారు. రంగ స్థలంలో పరిణితి జీవితంలో అన్నీ ఇస్తుందన్నారు. అనంతరం శిక్షణార్ధులు అభ్యాంతో నట పరిపక్వతకు నిమఘ్నమయ్యారు.