పర్యాటాకాభివ్రుద్ధికి ప్రత్యేక అప్లికేషన్..


Ens Balu
4
Tirupati
2022-04-21 15:36:35

రాష్ట్రంలో పర్యాటక భవన్ ఏర్పాటు, టూరిజం డెవలప్మెంట్ కొరకు సింగిల్ అప్లికేషన్ సాఫ్ట్ వేర్ ద్వారా అన్ని వివరాలు అందుబాటులో ఉండే విధంగా టూరిజం సాఫ్ట్ వేర్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి అన్నిరకాల చర్యలు చేపట్టనున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖామాత్యులు ఆర్.కే రోజా అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ హోటల్స్ అసోసియేషన్, తిరుపతి హోటల్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన అభినందన సభలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంద్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్.కే రోజా మాట్లాడుతూ పర్యాటక, ఆథిత్య రంగంలో పురోబివృద్ది దిశగా అన్ని చర్యలు చేపడతామని తెలిపారు. ఏ.పి హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాలకృష్ణ రెడ్డి మాట్లాడుతూ ఆతిథ్య రంగంలో ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి గారికి వినతి పత్రం సమర్పిస్తూ హోటల్స్ టైమింగ్ రాత్రి 12 గంటల వరకు జి.ఓ మేరకు హోటల్స్ తెరచి ఉంచుటకు అమలు అయ్యే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఆథిత్య రంగాన్ని, హోటళ్ళను పరిశ్రమలుగా గుర్తిస్తే రాయితీలకు అవకాశం కలుగుతుందని మంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. తన దృష్టికి తీసుకువచ్చిన అంశాలపై సానుకూలంగా స్పందిస్తూ హోటల్ టైమింగ్ జి.ఓ మేరకు అమలు అయ్యే విధంగా, హోటల్ లైసెన్స్ పర్మిషన్ కొరకు సమర్పించు డాక్యుమెంట్స్  మహారాష్ట్ర తరహాలో తక్కువ ఉండెలా, రాష్ట్రంలో పర్యాటక భవన్ ఏర్పాటు, టూరిజం డెవలప్మెంట్ కొరకు సాఫ్ట్ వేర్ అప్లికేషను డెవలప్ చేయడానికి అన్ని రకాల చర్యలు చేపట్టనున్నామని తెలిపారు. చంద్రగిరిలో సౌండ్ అండ్ లైట్స్ షో పునరుద్ధరణ, టి.టి.డి దర్శన్ టికెట్స్ హోటల్ అసోసియేషన్ వారికి కేటాయింపు విషయంలో టిటిడిని సంప్రదిస్తామని తెలిపారు. తిరుపతి ఎస్.వి జూ పార్క్ నందు సందర్శనార్థం వచ్చిన పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా ఎలక్ట్రికల్ వాహనాలను అనుమతి ఇవ్వమని హోటల్ యజమానులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ నెలాఖరు లోగా టూరిజంకు సంబంధించి సమగ్ర ప్రణాళిక తయారు చేస్తామనీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం అని తెలిపారు.   ఈ కార్యక్రమంలో ఏ.పి హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాలకృష్ణ రెడ్డి, తిరుపతి హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కృష్ణా బట్, తదితర హోటల్ యజమానులు పాల్గొన్నారు.