మహిళలు మరింత ఆర్ధికంగా ఎదగాలి..సభాపతి


Ens Balu
2
Srikakulam
2020-09-17 20:54:42

మహిళలను మహోన్నత శిఖరాలకు తీసుకువెళ్ళడమే ముఖ్య మంత్రి లక్ష్యమని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. ఆమదాలవలస జూనియర్ కళాశాల ప్రాంగణంలో వై.యస్.ఆర్ ఆసరా వారోత్సవాల కార్యక్రమం ముగింపు కార్యక్రమం గురు వారం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు ర్యాలీ నిర్వహించారు. ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.  ఈ కార్యక్రమంలో శాసన సభాపతి తమ్మినేని సీతారాం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సభాపతి మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబనతో మహిళా సాధికారిత దిశగా పయనించడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి నుండి నేరుగా లబ్ధిదారుని బ్యాంకు ఖాతాలో వివిధ పథకాల క్రింద ఆర్ధిక సహాయం జమ చేయడం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.  సంక్షేమ కార్యక్రమాలలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి స్థానంలో ఉందని సభాపతి చెప్పారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు అందాలని ఉవ్విళ్ళూరుతున్నారని తెలిపారు. వై.యస్.రాజశేఖర్ రెడ్డి,   వై.యస్.జగన్ మోహన్ రెడ్డి ప్రజల కోసం పుట్టారని కొనియాడారు. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర లో ఇచ్చిన హామీలను నవరత్నాలలో చేర్చి ఒకటిన్నర సంవత్సరంలో 90 శాతం వరకు  అమలుపరిచిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అన్నారు. సూర్యోదయం రాకుండా ముందుగానే ఇళ్ళ వద్దకు వాలంటీర్లు వచ్చి పింఛను అందిస్తున్నారని తెలిపారు. పేదలకు 30 లక్షల ఇళ్ళ పట్టాలు ఇచ్చుటకు అన్ని ఏర్పాట్లు చేసారని, అయితే కోర్టులో వ్యాజ్యం ఉండటంతో ఆలస్యం జరుగుతోందని వివరించారు. గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి గ్రామ పాలన మన వద్దకే తీసుకువచ్చారని సీతారాం అన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని చెప్పారు. అదే యువత కోవిడ్ కు ఎదురొడ్డి సేవలు అందించారని ప్రశంసించారు. మహిళలకు చట్టసభలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ముఖ్య మంత్రికి దక్కుతుందని అన్నారు. వెనుకబడిన వర్గాలను అత్యున్నత స్థాయిలో కూర్చోబెట్టిన ఘనత జగన్ కే దక్కుతుందని తెలిపారు.    ఈ కార్యక్రమంలో జిల్లా బాలుర క్రికెట్ సంఘం అధ్యక్షులు తమ్మినేని చిరంజీవి నాగ్, శ్రీరామ్మూర్తి , జెజె మోహన్ రావు, జెకే వెంక బాబు, బొడ్డేపల్లి రమేష్ కుమార్, గురుగుబెళ్ళి శ్రీనివాసరావు, బెండి గోవిందరావు, బెవర మల్లేష్, ఖండపు గోవిందరావు, సువ్వారి గాంధీ ,లోలుగు కాంతారావు, అధికారులు అనధికారు,  కార్యకర్తలు డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.