డంపింగ్ యార్డు నిర్వహణపై దృష్టి..
Ens Balu
7
Parvathipuram
2022-04-22 05:18:31
పార్వతీ పురం పురపాలక సంఘం పరిధిలో డంపింగ్ యార్డ్ నిర్వహణపై దృష్టి సారించడం జరిగిందని మునిసిపల్ కమీషనర్ ఏ.సింహాచలం తెలిపారు. డంపింగ్ యార్డ్ ను శుక్రవారం కమీషనర్ పరిశీలించారు. డంపింగ్ యార్డులో నిరంతరాయంగా నీటిని జల్లుతుండటం వలన 90 శాతం మేర సాధారణ స్థితికి చేరుకుందని పేర్కొన్నారు. మరి కొద్ది రోజులు నిరంతరాయంగా నీటిని జల్లాలని సిబ్బందికి ఆయన ఆదేశించారు. వేసవి తీవ్రత దృష్ట్యా నోడల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఎటువంటి అలసత్వం ఉండరాదని, చెత్తసేకరణలోనూ తగు జాగ్రత్త వహించాలని ఆయన పేర్కొన్నారు. నిబంధనల మేరకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. పార్వతీ పురం పురపాలక సంఘం పరిధిలో దేవాంగుల వీధి తదితర ప్రాంతాల్లో పారిశుధ్య పనుల కమీషనర్ తనిఖీ చేశారు. పట్టణం పరిశుభ్రంగా సుందరంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. చెత్త ను తడిచెత్త, పొడి చెత్తగా విభజన చేసి అందించాలని ఆయన అన్నారు. విభజన ప్రక్రియను పరిశీలించారు. తడిచెత్త, పొడి చెత్త ను వేరుచేసి మినీ వాహనాలలో డంప్ చేసి డంపింగ్ యార్డ్ కి తరలించాలని శానిటరీ ఇన్స్పెక్టర్ కి, సంబంధిత వార్డు శానిటేషన్ సెక్రటరీకి ఆదేశించారు. తడిచెత్త, పొడి చెత్త వేరుచేయు విధానం లో ఎటువంటి అలసత్వం వహించరాదని ఆయన పేర్కొన్నారు.