శభాష్ శ్రీకాకుళం..


Ens Balu
2
Srikakulam
2020-09-17 21:01:49

కోవిడ్ ఆసుపత్రుల నిర్వహణలో శ్రీకాకుళం జిల్లాకు ప్రధమ స్ధానం లభించింది. రాష్ట్రంలో కోవిడ్ సేవలు అందిస్తున్న 229 ఆసుపత్రుల్లో నిర్వహణ అంశాలను పరిగణనలోకి తీసుకోగా 2109.89 సగటు రేటింగు పాయింట్లతో జిల్లా ప్రధమ స్ధానంలో నిలిచింది. తూర్పు గోదావరి జిల్లా 1812.80 సగటు పాయింట్లతో ద్వితీయ స్దానంలోను, కృష్ణా జిల్లా 1806.37 సగటు పాయింట్లతో తృతీయ స్ధానంలో నిలిచింది. జిల్లాలో 14 ఆసుపత్రులు కోవిడ్ సేవలు అందించుటకు గుర్తించగా ఇప్పటి వరకు 13 ఆసుపత్రులు సేవలు అందిస్తున్నాయి. టెక్కలి జిల్లా ఆసుపత్రి, జెమ్స్ ఆసుపత్రి, లైఫ్ ఆసుపత్రి, శాంతి ఆసుపత్రి జిల్లా స్ధాయి ఆసుపత్రుల పాయింట్ల పట్టికలో నంబరు 1 రేటింగు పాయింట్లు సాధించాయి. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, కిమ్స్, అమృత, పాలకొండ ఏరియా ఆసుపత్రి, సింధూర ఆసుపత్రి నంబరు 2 రేటింగు పాయింట్లు సాధించగా, యునీక్ ఆసుపత్రి నంబరు 4, డా.గొలివి, కమల, పి.వి.ఎస్.రామ్మోహన్ ఆసుపత్రులు నంబరు 5 రేటింగు పాయింట్లు సాధించాయి.