మన్యం జిల్లాకు రూ.13.68 కోట్లు జమ..


Ens Balu
3
Parvathipuram
2022-04-22 08:13:08

అక్కా చెల్లెమ్మలకు మంచి చేయాలనేది ధ్యేయమని రాష్ట్ర ముఖ్య మంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ పథకం కింద సంఘాల సభ్యుల ఖాతాలకు నిధులు జమ చేసే కార్య్రమం శుక్రవారం జరిగింది. ప్రకాశం జిల్లాలో పాల్గొన్న ముఖ్య మంత్రి బటన్ నొక్కి నిధులు నేరుగా ఖాతాల్లో జమ చేశారు. ముఖ్య మంత్రి మాట్లాడుతూ సున్నా వడ్డీ పథకం క్రింద మూడు సంవత్సరాలలో రూ.3,615 కోట్లు చెల్లించామని చెప్పారు.  పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ 20,055 స్వయం సహాయక సంఘాలలోని 2,30,675 మంది సభ్యులకు రూ.13.68 కోట్లు నిధులు జమ అవుతుందన్నారు. జిల్లాలో మొదటి విడతలో 2019 - 20 సంవత్సరానికి 16,695 సంఘాల్లోని 1,92,694 మంది సభ్యులకు రూ.11.05 కోట్లు,  2020 - 21 ఆర్థిక సంవత్సరంలో 18,868 సంఘాలలోని 2,15,165 మంది సభ్యులకు రూ.10.66 కోట్లు చెల్లించడం జరిగిందని చెప్పారు. మూడు సంవత్సరాల్లో 20,055 మహిళా సంఘాలలోని 2,30,675 సభ్యులకు మొత్తం రూ.35.39 కోట్లు విడుదల చేయడం జరిగిందని వివరించారు.

మూడవ విడత క్రింద డి.ఆర్.డి.ఏ పరిధిలో పార్వతీపురం నియోజక వర్గంలో  4337 స్వయం సహాయక సంఘాలకు రూ.2.78 కోట్లు, కురుపాం నియోజక వర్గంలో 4893 స్వయం సహాయక సంఘాలకు రూ.2.51 కోట్లు, సాలూరు నియోజక వర్గంలో 3315 స్వయం సహాయక సంఘాలకు రూ.1.70 కోట్లు, పాలకొండ నియోజక వర్గంలో 4694 స్వయం సహాయక సంఘాలకు రూ.2.43 కోట్లు విడుదల కాగా., మెప్మా పరిధిలో గల పార్వతీపురం మునిసిపాలిటీ పరిధిలో గల 1006 మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.1.42 కోట్లు, సాలూరు మునిసిపాలిటీ పరిధిలో గల 1181 మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.1.85 కోట్లు, పాలకొండ మునిసిపాలిటీ పరిధిలో గల 629 మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.99 లక్షలు వెరసి రూ.4.26 కోట్లు జమ అవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా నమూనా చెక్కులను పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు అలజంగి జోగారావు, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ఆర్.కూర్మనాథ్, మునిసిపల్ చైర్ పర్సన్ బోను గౌరీశ్వరి, వైస్ చైర్ పర్సన్ కె.రుక్మిణి, వైఎస్సార్ క్రాంతి పథం ఏపీడి సత్యం నాయుడు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.