జిల్లాకు రానున్న డిప్యూటీ సీఎం రాజన్నదొర


Ens Balu
9
Parvathipuram
2022-04-22 09:47:36

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదొర శనివారం జిల్లాకు వస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన జారీ చేశారు. శనివారం ఉదయం 6.15 గంటలకు సాలూరులో ఉపముఖ్యమంత్రి నివాసానికి చేరుకుంటారని ఆయన పేర్కొన్నారు. 24వ తేదీన విజయనగరం జిల్లా ఎస్.కోట లో పర్యటిస్తారని, 25వ తేదీ సాయంత్రం 4:30 గంటలకు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షిస్తారని ఆయన చెప్పారు. 26వ తేదీన విజయనగరంలో జరిగే నీతి అయోగ్ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పాల్గొంటారని రాష్ట్ర కార్యాలయం పేర్కొన్నట్టు పర్యటన వివరాలు ఉన్నాయని కలెక్టర్ వివరించారు.