24నుంచి పాడి రైతులకు రుణాలు..


Ens Balu
11
Tirupati
2022-04-22 09:52:13

రైతు భాగస్వామ్యం – మన ప్రాధాన్యత ప్రత్యేక క్యాంపుల ద్వారా పాడి మరియు మత్స్య పరిశ్రమ ల కోసం ఈ నెల 24 నుండి మే 1 వరకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బ్యాంకర్లు రుణ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం తిరుపతి కలెక్టరేట్ లోని సమావేశ మందిరం లో ప్రత్యేక జిల్లా సమీక్షా సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన బ్యాంకర్లతో, జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. 
రైతు భాగస్వామ్యం – మన ప్రాధాన్యతా క్యాంపు ల నిర్వహణ పై లీడ్ బ్యాంక్ మేనేజర్ వివరించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లోని 445 ఆర్ బి కె ల ద్వారా పి ఎం కిసాన్ లబ్దిపొందని ఆర్ బి కె పరిధిలో కనీసం 10 మందికి తక్కువ కాకుండా పాడి మరియు మత్స్య రుణాల కోసం లబ్దిదారులను గుర్తించాలని అధికారులకు సూచించారు. బ్యాంకర్లు తమ పరిధిలోని ఆర్ బి కేల నుండి అందే జాబితా మేరకు అర్హత గల లబ్దిదారులను గుర్తించి వారికి రుణాలను మంజూరు చేయాలని సూచించారు. ప్రస్తుతం రుణ మేళా నిర్వహిస్తున్న నేపథ్యం లో గతం లో రుణాల కోసం దరఖాస్తులు చేసుకున్న రైతుల జాబితాలను పరిశీలించి అర్హత మేరకు తప్పని సరి రుణాలను మంజూరు చేయాలని సూచించారు. వ్యవసాయ, పశు సంవర్థక, మత్స్య శాఖల అధికారులు సమన్వయం తో లబ్దిదారులకు అవగాహన కల్పించి మంజూరు చేయాల్సి ఉంటుందని సూచించారు. జిల్లా లో దాదాపు 8200 వరకు గృహ నిర్మాణాలు ప్రారంభం కాలేదని ఎస్ హెచ్ జి సంఘాల లబ్దిదారులకు కనీసం రూ.35 వేలు ఋణం మంజూరు చేయాలని బ్యాంకర్లకు సూచించారు. స్టాండ్ అప్ ఇండియా లోన్ ల పై కూడా దృష్టి పెట్టగలిగితే 6వేల ఎకరాల ఏ పి ఐ ఐ సి భూములు పరిశ్రమల కోసం అందుబాటులో ఉన్నాయని చాల మంది పరిశ్రమల రుణాల కోసం వేచి ఉన్నారని, జిల్లా లో అన్ని అనుకూల వసతులు ఉన్నందున బ్యాంకర్లు పరిశ్రమల రుణాల మంజూరు పై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సమావేశం లో ఈ డి ఎం నాబార్డ్ సునీల్, లీడ్ బ్యాంక్ కన్వీనర్ అరుణ, ఏ జి ఎం యూనియన్ బ్యాంక్ శర్మ, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, వ్యవసాయ, మత్స్య పశు సంవర్థక శాఖ ల అధికారులు పాల్గొన్నారు.