కాకినాడనగర పాలకసంస్థ స్టాండింగ్ కమిటీ తీర్మానాలను జిల్లా కలెక్టర్ నిలుపు చేయాలని పౌరసంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. మరో2నెలల్లో కాకినాడస్థానిక ఎన్నికలనోటిఫి కేషన్ రానుందని అత్యవసరమైన పనులు త్రాగునీరు..పూడికలు తీయించడం.. పారిశుద్ధ్యపనుల కు.. మినహా ఇతర పనులకు కౌన్సిల్ పదవీకాలం ముగుస్తున్న ఆఖరి 5నెలలలో అనుమతిం చే అధికారం వుండదని పేర్కొన్నారు. స్టాండింగ్ సప్లిమెంట్'బులిటెన్లలో సాధారణపనులకురు.10కోట్లు కేటాయిం చే 22అంశాలు చేర్చారని పేర్కొన్నారు.ఇవి కాకుండా బోటుక్లబ్బుపార్కు వివేకానందపార్కుగాంధీనగర్ పార్కుల పర్యవేక్ష ణపేరిట కోటిన్నర కేటా యించడం అనుచితం గా వుందన్నారు. మరెన్ని సప్లిమెంట్లు వస్తాయో అర్థంకాని దుస్తితివుందన్నారు. ఇప్పటికే రు.29కోట్ల రూపాయల కాంట్రాక్టర్ల బకాయిలున్నాయని-స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు ఆగిపోయే పరిస్థితిలో రు.300కోట్ల రూపా యల భారం పడనుం దన్నారు. జనరల్ నిధులు రు.150 కోట్లు ఇతర ప్రభుత్వ విభాగా లకు మళ్లించారని ప్రభుత్వ కార్యాలయాల పెండింగ్ ఆస్తిపన్ను బకాయి రు.66కోట్లు వాటి అదనపు భవనాల కొలతలు తీయని అంచనాపన్ను పెరిగిన 15శాతం పన్ను కలిపి మరో రు.5కోట్లు వుంటుందని పౌర సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణ రాజు పేర్కొన్నారు. ఇదే అజెండాలో 32వ అంశం నందు ద్వారంపూడి పేరిట 6గొడౌన్లకు 50 శాతం పన్నురాయితీ ఇవ్వడం ద్వారా రు.6 లక్షలు రిఫండ్ ఇచ్చే అంశం తేవడం విడ్డూరంగా ఉందన్నా రు. తీవ్రఆర్థిక మాంద్యం లో వున్న కాకినాడ నగర పాలక సంస్థకు రాబోయే వర్షాల్లో ముంపు కు గురయ్యే ప్రమాదం ఎదురుకానుందని హెచ్చరించారు. జనరల్ నిధుల్లో ఇప్పటికే రు.50కోట్ల రూపాయల పనులు నిలిచిపోయా యని వీటికి తోడుగా మరిన్నిఅత్యవసరంకాని పనులు ఆమోదిస్తేఆర్థికభవిష్యత్తు అంధకార మవుతుందన్నారు.
10శాతం కమీషన్ కోసంకక్కుర్తి పడుతున్న కార్పొరేటర్లు కార్పోరేషన్ భవితవ్యం కోసం కించిత్ ఆలోచన లేకపోవడం దుర్మార్గపు చర్యగా పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే కౌన్సిల్ దుర్వినియో గాన్ని నియంత్రణ చేయాలని రాష్ట్ర ఎన్నికల కమీషన్ కు కొత్త కౌన్సిల్ ఎన్నికలపై దిశా నిర్దేశం చేయాలని కోరారు. పరిసర 6గ్రామాలు విలీనం చేసుకునే తీర్మానం అమలుచేయించి కాకినాడ ఎన్నికలు సకాలంలో నిర్వహించాలని డిమాండ్ చేశారు.