పర్యావరణ పరిరక్షణ అందరి భాద్యత
Ens Balu
7
Srikakulam
2022-04-22 10:09:38
పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజలందరి పైన ఉందని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, ప్రాంతీయ కార్యాలయ అధికారి ఎస్. శంకర్ నాయక్ పేర్కొన్నారు. ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో జిల్లాలో వివిధ ప్రాంతాలలో ప్రజలకు పర్యావరణంపై అవగాహన కల్పించడం కొరకు విభూతి బ్రదర్స్ కళాజాత బృందం వారిచే రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి పుడమిని కాపాడుకోవాలని అలాగే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి జ్యూట్, వస్త్ర మరియు కాగితంతో తయారుచేసిన సంచులు వాడడం ద్వారా పర్యావరణాన్ని రక్షించవచ్చనే అంశాలపై ఇచ్చాపురం, పలాస, టెక్కలి, శ్రీకాకుళం లలో పలు ప్రాంతాలలో వీధి నాటికలు ప్రదర్శించి ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పించారు. కాలుష్య నియంత్రణ మండలి, ప్రాంతీయ అధికారి ఎస్.శంకర్ నాయక్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ ఎన్విరాల్మెంట్. ఇంజనీర్ హరీష్ నాటక ప్రదర్శనకు ముందు సభ నిర్వహించి పర్యావరణ పరిరక్షణ నిమిత్తం చేపట్టవలసిన పనులను వివరించారు.