ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలి


Ens Balu
7
Rajahmundry
2022-04-22 11:52:55

ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డా.కె. మాధవిలత ఆదేశించారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వాసుపత్రి లో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు.  ఈ సమావేశం లో నగరపాలక సంస్థ కమిషనర్ కె.దినేష్ కుమార్, శానసభ్యులు జక్కంపూడి రాజా, రుడా చైర్ పర్సన్ షర్మిల రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ రోగులకు అవసరమైన మందులు, సర్జికల్ పరికరాలు, ల్యాబ్ కి అవసరం అయిన సామగ్రి పూర్తి స్థాయిలో అందుబాటు లో ఉంచాలన్నారు. 
రోగులు మరియు పేషెంట్ అటెండెంట్ల భద్రతకు నిర్దుష్టమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.  మందులు, సర్జికల్స్, ల్యాబ్ వస్తువులు, ఆర్థో పరికరాలు ఆంధ్ర ప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ద్వారా పేర్కొనబడని వస్తువుల కోసం టెండర్లు పిలవడానికి అనుమతి  కోరడం జరిగింది. కొనుగోలు కమిటీ రిజల్యూషన్ మేరకు టెండర్లను పిలవడానికి, అత్యవసర అవసరాలను ఖరారు చేయడానికి జిల్లా కొనుగోలు కమిటీకి సూచనలను జారీ చేయడానికి సమావేశంలో చర్చించడం జరిగిందన్నారు.  కొత్త క్యాంటీన్ భవన నిర్మాణానికి కొత్త స్థలానికి, మరమ్మతులు & రూఫ్ లీకేజీలు, ప్లంబింగ్, శానిటరీ & వాటర్ సప్లై రీప్లేస్‌మెంట్ల కోసం చర్చించారు.   వికాస్ ఫార్మసీ కళాశాల, రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో తాత్కాలిక పేషెంట్ కౌన్సెలింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి దర్శిని, ఔట్ పేషెంట్స్ & ఇన్ పేషెంట్లకు కౌన్సెలింగ్ నిర్వహించడంపై సమావేశంలో దిశా నిర్దేశనం చేశారు. .  

 డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ కింద చేసిన ఖర్చుల ధృవీకరణ కోసం , ఆరోగ్యశ్రీ ఫండ్ అభ్యర్థన నుండి రెండు బాడీ ఫ్రీజర్‌లను కొనుగోలు చేయడానికి అనుమతి.  ధృవీకరణ కోసం సమర్పించబడింది.  కమీషనర్, ఏపి వివిపి, విజయవాడ వారి సూచనల మేరకు ప్రతి నెల 5వ తేదీన అభివృద్ధి కమిటీ మీటింగ్‌ను నిర్వహించడం.  క్యాజువాలిటీని 24X7 సమర్థవంతంగా అమలు చేయడానికి జాతీయ ఆరోగ్య మిషన్  కింద ఖాళీగా ఉన్న ఏడు ముఖ్య మెడికల్ ఆఫీసర్ పోస్టుల నియామకం.  రూ.49.80 లక్షల వ్యయంతో నిర్దిష్ట సివిల్ & ఎలక్ట్రికల్ పనుల అనుమతి, కొన్ని సివిల్ పనులకు మంజూరైన మరియు మెడికల్ కాలేజీ పనుల కారణంగా వినియోగించ బడని బ్యాలెన్స్ నిధులపై చర్చించారు. ఐ సి యూ యూనిట్స్, ఎసి మరమ్మతులు,  రెండు టన్నుల  ఎయిర్ కండీషనర్‌లను కొనుగోలు,  ఆపరేషన్ థియేటర్‌లో ఆపరేషన్ టేబుల్స్, తదితర సామగ్రి కొనుగోలు పై సానుకూల నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. సీసీ కెమెరాలు, వంటి అంశాలపై నిర్ణయం తీసుకున్నారు.

శాసన సభ్యులు జక్కంపూడి రాజా మాట్లాడుతూ, ఆసుపత్రి కి వొచ్చే రోగులకు ఇబ్బందులకు గురిచేయ్యకుండా వైద్య సేవలు అందించాలన్నారు. ఒక మంచి ఉద్దేశ్య ముతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు అందించే దిశలో నాడు నేడు ద్వారా అభివృద్ధి చేసి, కార్పొరేట్ తరహా వైద్య సేవలు పేదలకు అందుబాటు లోకి తెచ్చారన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పటిష్టం చేశారన్నారు. జిల్లా ప్రధాన కేంద్రంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కోసం మరింతగా నిధులు కేటాయించాలని కోరుతామన్నరు. ఈ సమావేశంలో నగర పాలక సంస్థ కె. దినేష్ కుమార్, రుడా చైర్ పర్సన్ ఎమ్. షర్మిలా రెడ్డి, డిసి హెచ్ ఎస్ డా. సనత్ కుమారి, డిఎమ్అండ్ హేచ్ఓ డా. బి. మీనాక్షి సూపరింటెండెంట్ బి. పి. సతీష్ కుమార్, నర్సింగ్ సూపరింటెండెంట్ టివివి కే భాగ్యలక్ష్మి, అభివృద్ధి సభ్యులు మార్గని రాము, కే. సత్తిబాబు, తదితులు పాల్గొన్నారు.