సున్నావడ్డీ అల్లూరి జిల్లాకు రూ.4 కోట్లు


Ens Balu
6
Paderu
2022-04-22 11:55:17

వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద మూడవ విడతలో భాగంగా సీతారామరాజు జిల్లాకు చెందిన 12,087 ఎస్ హెచ్ జిల నుండి 1,28,201 మందికి లబ్ధి చేకూరిందని జిల్లా పరిషత్ చైర్పర్సన్  జె సుభద్ర, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడించారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒంగోలు నుండి వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం మూడవ విడత కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన వీడియో కాన్ఫరెన్సింగ్ విధానంలో లబ్ధిదారులు తోపాటు  జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర, జిల్లా కలెక్టర్ కుమార్ సుమిత్ కుమార్, పాడేరు అరకు శాసనసభ్యులు కే భాగ్యలక్ష్మి, షెట్టి ఫాల్గుణ ట్రైకార్ ఛైర్మన్ సతక బుల్లి బాబు ఎస్ హెచ్ జి సభ్యులు వీక్షించారు.  జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం లో భాగంగా మూడవ విడత రూ.1261 కోట్లు విడుదల చేయడం జరిగిందని ఒక కోటి రెండు లక్షల మందికిపైగా లబ్ధి చేకూరిందని తెలిపారు.  2020లో మొదటి విడతగా 1258 కోట్లు, 2020లో రెండవ విడతగా 1100 కోట్లు కలిపి మూడేళ్లలో మూడు వేల ఆరు వందల కోట్లు అందజేశామన్నారు.  గత ప్రభుత్వ చర్యల వల్ల 18.36 శాతం స్వయం సహాయక సంఘాలు దిగజారిపోయారు దిగజారిపోయాయని , ప్రస్తుతము ఆ సంఘాలన్నీ పొందుతూ ఉన్నాయన కేవలం 0.73  శాతం మాత్రమే పుంజుకోవలసి ఉందన్నారు. అదేవిధంగా వైయస్సార్ చేయూత, వైఎస్సార్ రైతు భరోసా, వైయస్సార్ ఇల్లు కేటాయింపు, అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైయస్సార్ పెన్షన్, జగనన్న గోరుముద్దలు, వైయస్సార్ ఆరోగ్యశ్రీ తదితర పథకాల గురించి ముఖ్యమంత్రి వివరించారు.  ఎటువంటి లంచాలు, ఆలస్యం, వివక్ష లేకుండా అన్ని పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు.

     ముఖ్యమంత్రి సందేశం అనంతరం అల్లూరి సీతారామరాజు జిల్లాలోగల 12,087 ఎస్ హెచ్ జిల నుండి 1,28,201 మందికి లబ్ధి చేకూరుస్తూ నాలుగు కోట్ల 5 లక్షల రూపాయల చెక్కును పంపిణీ చేశారు. అందులో అరకు నియోజకవర్గానికి చెందిన ఆరు మండలాల్లో 3098 గ్రూపులలోని 35,071 మందికి రూ. 62 లక్షలు, పాడేరు నియోజకవర్గానికి చెందిన ఐదు మండలాల్లోని 2658 గ్రూపులలోని 29,631 మందికి రూ. 83 లక్షలు, రంపచోడవరం నియోజకవర్గానికి చెందిన 11 మండలాల్లోని  6331  గ్రూపులలోని 63499 మందికి రూ. 2.6 కోట్ల తో లబ్ధి చేకూరింది. 

      ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సున్నా వడ్డీ పథకం క్రింద రుణాలు పెంచే విధంగా చర్యలు తీసుకోవడం వీడిని ఆదేశించారు. అదేవిధంగా లబ్ధిదారులతో మాట్లాడి, వారి వార సాధకబాధకాలు తెలుసుకున్నారు.  ప్రతి గ్రూపులోని సభ్యులు ఇతర గ్రూపులను ప్రోత్సహించే విధంగా వారి వారి కాళ్లపై వారు నిలబడి సాధికారత సాధించాలని సూచించారు.
         కార్యక్రమంలో భాగంగా హుకుంపేట కు చెందిన మజ్జి పార్వతి మాట్లాడుతూ వారి ఇంట్లో వారి ఆత్తకు ఆమ్మకు పెన్షన్ అందుతుందని, ఇద్దరు అబ్బాయిలకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన అందుతున్నాయని, రైతు భరోసా కింద తనకు కూడా పోడు భూమికి సైతం లబ్ధి చేకూరిందని ఆనంద వ్యక్తపరిచారు.  ముంచంగిపుట్టుకి  చెందిన సిహెచ్ దుర్గాదేవి మాట్లాడుతూ కూరగాయల వ్యాపారం చేస్తున్నానని, నా జీవితం సాఫీగా సాగిపోతుందని, వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం ఆసరాగా నిలిచిందని తెలిపారు.