ఎండ తీవ్రత పట్ల అప్రమత్త అవసరం
Ens Balu
3
Visakhapatnam
2022-04-23 08:27:17
విశాఖ స్మార్ట్ సిటీ అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్ లో 2.0 లో విశాఖకు 4వ స్టార్ రేటింగ్ వచ్చిన సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి .లక్ష్మిశ నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారిని కలిశారు. శనివారము ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆమె చాంబర్లో పర్యావరణ లో 4 స్టార్ రేటింగ్ లో వచ్చిన అవార్డులను నగర మేయర్ కు చూపించారు. ఈ సందర్భంగా కమిషనర్ సూరత్ లో పర్యావరణం పై అవలంబిస్తున్న పద్ధతులను మేయర్ కు వివరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో కేంద్ర గృహ మరియు పట్టణ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్మార్ట్ సిటీ ఎసెస్మెంట్ ఫ్రేమ్వర్క్ 2.0 లో విశాఖకు 4 స్టార్ రేటింగ్ రావడంపై మేయర్ కమిషనర్ ను అభినందించారు. పర్యావరణ పరిరక్షణలో అధికారుల నుండి కార్పొరేటర్ల వరకు టీం వర్క్ గా పని చేయాలని, అందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, వారంలో ఒకరోజు ఆఫీసుకు సైకిల్ ను, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఉపయోగించి రావడం తదితర అంశాలపై దృష్టిసారించి అని తెలిపారు. మోటార్ వాహనాల వినియోగాన్ని తగ్గించి పర్యావరణ హితమైన సోలార్ ను, బ్యాటరీ వాహనాలను ఉపయోగించడం ద్వారా కొంతవరకైనా పర్యావరణాన్ని కాపాడుగలుతామని ఆమె తెలిపారు. కమిషనర్ తెలిపిన విధంగా పర్యావరణం పరిరక్షణ కొరకు కౌన్సిల్లో కొన్ని తీర్మానాలు చేయవలసిన అవసరం ఉందని తెలిపారు