శ్రీకాకుళం-మన్యం ఆర్టీసీ ఎక్స్ ప్రెస్..


Ens Balu
3
Parvathipuram
2022-04-23 08:40:44

శ్రీకాకుళం నుంచి మన్యం జిల్లా కేంద్రం పార్వతీపురం వరకు ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసులను సోమవారం నుండి ప్రారంభిస్తున్నట్లు శ్రీకాకుళం ప్రజా రవాణా శాఖ జిల్లా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ మేనేజర్ ఏ.విజయ్ కుమార్ తెలిపారు ఈ మేరకు ఒక ప్రకటన శనివారం విడుదల చేశారు. ఏప్రిల్ 25వ తేదీ, సోమవారం ఉదయం 7 గంటలకు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ లో బస్సు ప్రారంభం అవుతుందని ఆయన చెప్పారు. 7 గంటలకు ప్రారంభమైన బస్సు పాలకొండ మీదుగా పార్వతీపురం ఉదయం 9.30 గంటలకు చేరుకుంటుందని పేర్కొన్నారు. పార్వతిపురంలో  ఉదయం 9.30 గంటలకు,  సాయంత్రం 6 గంటలకు బస్సు బయలు దేరుతుందని ఆయన చెప్పారు. శ్రీకాకుళంలో ఉదయం 7 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు పార్వతీపురం బస్సు బయలుదేరుతుందని ఆయన చెప్పారు. జిల్లా కేంద్రం నుండి జిల్లా కేంద్రం వరకు ఎక్స్ ప్రెస్ బస్ సర్వీసులు ఉండాలనే ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేశామని ఆయన వివరించారు.