వ్యాపారాల కోసం రోడ్లు పాడు చేస్తారా
Ens Balu
7
Anantapur
2022-04-23 12:01:11
ఒక వైపు కోట్ల రూపాయలు ఖర్చు చేసి రోడ్లు ఏర్పాటు చేస్తుంటే మీ వ్యాపారాల కోసం రోడ్లు ధ్వంసం చేస్తారా అని నగర మేయర్ మహమ్మద్ వసీం ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని విద్యుత్ నగర్ సర్కిల్ నుండి హౌసింగ్ బోర్డ్ సర్కిల్ వరకు ఇటీవల వేసిన బిటి రోడ్డు ను శనివారం మేయర్ వసీం పరిశీలించారు. ఈ సందర్భంగా కొందరు వ్యాపారులు తమ వ్యాపారాలు కోసం షామియానాలు వేసుకుని వాటి మేకులను బీటీ రోడ్ పై కొట్టి ఉండటంతో వాటిని గమనించిన మేయర్ వసీం వ్యాపారులను పిలిపించి రోడ్లు ధ్వంసం అయ్యేలా ఎలా మేకులు ఇష్టారాజ్యంగా కొడతారని ప్రశ్నించారు. ఇకపై ఇలాంటివి చేస్తే వ్యాపారులతో సప్లయర్ యజమానులకు కూడా ఫైన్ లు వేయాలని అధికారులకు సూచించారు. సచివాలయ సిబ్బంది కూడా రోడ్లు ధ్వంసం అయ్యేలా ఎవరన్నా వ్యవహరిస్తుంటే అలాంటి వారిపై కఠినంగా సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు అనీల్ కుమార్ రెడ్డి,సంపంగి రామాంజనేయులు, కార్యదర్శి సంగం శ్రీనివాసులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.