అర్హులందరికీ సచివాలయాల ద్వారా వివిధ సేవలను సకాలంలో అందించాలని జిల్లా కలెక్టర్ రవి సుభాష్ పటంశెట్టి ఆదేశించారు శనివారం ఆయన సబ్బవరం మండలం అసకపల్లి, గొట్టివాడ సచివాలయాల ను సందర్శించి పనితీరును పరిశీలించారు. సచివాలయానికి పనులపై వచ్చిన వారు నిరాశగా వెనుకకు పోరాదన్నారు. అర్హులైనప్పటికి కొందరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల అవగాహన ఉండదని అటువంటి వారికి పథకాలను గూర్చి తెలియజేయాలన్నారు. అసకపల్లి లో హౌసింగ్ లే అవుట్లను, నిర్మాణాలను పరిశీలించారు. ఇసుక సిమెంటు సరఫరాపై లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని కోరారు.