నాడు-నేడుతో రూపురేఖలు మారిపోవాలి


Ens Balu
10
Anakapalle
2022-04-23 12:11:45

అనకాపల్లిజిల్లాకు మంజూరైన రెండవ విడత నాడు-నేడు పనులు మొదటి విడత లానే విద్యార్థులకు  సౌకర్యవంతంగా సుందరంగా  తీర్చి దిద్దాలని జిల్లా కలెక్టర్ రవి సుభాష్ పటంశెట్టి విద్యాశాఖ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో శనివారం నాడు నేడు పనులపై సర్వ శిక్ష అభియాన్, ఏ పీ ఈ డబల్ యు ఐ డి సి ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.  కలెక్టర్ మాట్లాడుతూ నాడు నేడు రెండో విడతలో జిల్లాకు 379 పాఠశాలలు ఎంపిక చేయబడ్డాయన్నారు.  నాడు నేడు పనుల మూలంగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారి తల్లిదండ్రులు పిల్లలను ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తున్నారు అన్నారు.  పాఠశాలను అందంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం తో పాటు పనులను మరింత వేగంగా పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి లింగేశ్వర రెడ్డి సర్వ శిక్ష అభియాన్ ఈ ఈ నరసింహారావు ఏపీఈ డబ్ల్యుఐడిసి డి.ఈ. మృత్యుంజయరావు ఏ.ఈ.లు తదితరులు పాల్గొన్నారు.