రాష్ట్ర ప్రభుత్వం మహిళలు సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ, ఆర్థిక సాధికారికత దిశగా అడుగులు వేస్తున్నామని రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత పేర్కొన్నారు. శనివారం కొవ్వూరులో సుందర స్థాయి కళ్యాణ మంటపం లో వాలంటీర్ సన్మాన కార్యక్రమం, సున్న వడ్డీ చెక్కుల పంపిణీ కార్య్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, తూర్పు గోదావరి జిల్లాలో 4,596 సంఘాలకు రు.45.51 కోట్ల మేర సున్న వడ్డీ రాయతీ ని అందించామన్నారు. కొవ్వూరు నియోజకవర్గ స్థాయిలోని 4576 గ్రూపులో ఉన్న మహిళలకు రు.6.68 కోట్ల మేర సున్న వడ్డీ రాయతీ నేరుగా వారి బ్యాంకు ఖాతాకు జమ చేశామన్నారు. గ్రామ, వార్డు వాలంటీర్లు ప్రజలకు, ప్రభుత్వా నికి వారధిగా నిలుస్తున్నారని తానేటి వనిత పేర్కొన్నారు. వారి సేవలను గుర్తిస్తూ తగిన రీతిన సత్కరించిన సందర్భం ఎప్పుడు జరుగలేదని, కేవలం జగనన్న హాయంలో అటువంటి గుర్తింపు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మునిసిపల్ ఛైర్ పర్సన్ బావన రత్నకుమా రి, మునిసిపల్ వైస్ ఛైర్ పర్సన్ గండ్రోతు అంజలీ దేవి, మాజి ఎమ్మెల్సీ కోడూరి శివరామ కృ ష్ణ, అక్షయ పాత్ర శ్రీని వాస రవీం ద్ర, ఆర్. భాస్కర రావు, పలువురు కౌన్సిలర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పా ల్గొన్నారు.