28న జిల్లాలో ఇళ్ల పట్టాల పండుగ..


Ens Balu
6
Anakapalle
2022-04-23 13:52:59

ఆంధ్రప్రదేశ్ లో నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందని రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చెప్పారు. 28వ తేదీన  రాష్ట్రంలో 32 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ జరుగుతుందని పేర్కొన్నారు. విశాఖపట్నం పట్టణం పరిధిలో ఉన్న విశాఖపట్నం, గాజువాక, అనకాపల్లి, పెందుర్తి నియోజకవర్గ ప్రజలకు పట్టాల పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.  324 ఎకరాల్లో లే అవుట్ వేసినట్లు చెప్పారు.  జివిఎంసి పరిధిలో ఉన్న ప్రజలకు భూ సేకరణ చేసి పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.  పెందుర్తి శాసన  సభ్యులు అదీప్ రాజ్ మాట్లాడుతూ 28వ తేదీన పెద్ద ఎత్తున పట్టాల పంపిణీ జరుగుతుందన్నారు. పెందుర్తి నియోజకవర్గంలో సుమారు 50 వేల మందికి పట్టాలు పంపిణీ జరుగుతుందని తెలిపారు. ఈ పర్యటనలో డిఐజి ఎస్. హరికృష్ణ, అనకాపల్లి జిల్లా కలెక్టర్ పఠాన్ శెట్టి రవి శభాష్, పెందుర్తి శాసన సభ్యులు అదీప్ రాజ్, జివిఎంసి కమీషనర్ లక్ష్మీశా, ఎస్పీ గౌతమ్ శాలిని, జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పన కుమారి, అదనపు ఎస్పీ కె. శ్రావణి, ఆర్డీవో, అనకాపల్లి చిన్ని కృష్ణ, ఉప కలెక్టర్ గున్నయ్య, తదితర అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.