మచిలీపట్నంలో అత్యధికంగా 5.5 సె.మీ వర్షపాతం
Ens Balu
3
Machilipatnam
2020-09-17 21:12:36
కృష్ణా జిల్లా కేంద్ర నగరం మచిలీపట్నంలో గురువారం మధ్యాహ్నం 3.55 గం.ల నుంచి గంటన్నర సేపు రికార్డ్ స్థాయిలో 5.5 సె.మీ వర్షం కురవటంతో వర్షపు నీటిలో పట్టణంలో అన్ని ప్రదాన రహదారులు పూర్తిగా జలమయం అయ్యాయి. కేవలం గంటన్నరలో ఇంత వర్షం కురవడంతో డ్రైనేజీల మురుగు నీరు కూడా రోడ్లపైకి వచ్చింది. ఇక్కడి వరదనీటిని బయటకు పంపే అవకాశం లేకపోవడంతో నీరు మొత్తం రోడ్లపైనా, పంట కాలువల్లోనే ఉండిపోయింది. కాగా ఈనెల 14 ఉదయం నుండి 24 గంటల్లో కురిసిన 6.5 సె.మి వర్షం నీరు ఇంకా నిల్వ ఉండటం, దానికి తోడు ఈ మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి తోడై అనేక పల్లపు ప్రాంతాల్లో వాననీరు ప్రవహిస్తోంది. ఇదే ఇటీవల గంటన్నరలో రికార్డ్ అయిన అత్యధిక వర్షపాతం అని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు వర్షంతో నగరంలోని రోడ్లలోపై వర్షపు నీరు లో అనేక వాహనాలు నీటమునిగాయి.సాయంత్రం కూడా రాకపోకలకు అనుకూలంగా లేక ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.