నేషనల్ హైవే భూసేకరణను సత్వరం పూర్తిచేయాలి..


Ens Balu
2
కలెక్టరేట్
2020-09-17 21:13:50

జాతీయ రహదారి భూ సేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  ఆనందపురం, అనకాపల్లి 6 లైన్ల జాతీయ రహదారి భూ సేకరణకు సంబంధించి అధికారులతో గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆయన సమీక్షించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంత వరకు చేసిన భూ సేకరణకు సంబంధించి చెల్లింపులు చేసింది లేనిది అడిగి తెలుసుకున్నారు.  పెండింగ్  సమస్యలపైన, జాతీయ రహదారి ప్రగతిపైన ప్రత్యేక ఉప కలెక్టర్ (ఎన్.హెచ్.16) ఎం. సూర్యకళ, తహసిల్థార్లతో చర్చించారు.  భూ సేకరణను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.  ఈ సమావేశంలో  ప్రాజెక్టు డైరక్టర్, ప్రత్యేక ఉప కలెక్టర్ (భూ సేకరణ ఎన్.హెచ్.16) ఎం.సూర్యకళ, సబ్బవరం, అనకాపల్లి, ఆనందపురం మండలాల తహసిల్థార్లు, తదితరులు పాల్గొన్నారు.