అన్నమాచార్య జ్ఞాపకాల పునః నిర్మించాలి
Ens Balu
6
Kakinada
2022-04-25 06:56:29
తిరుమల కొండపై కనుమరుగైన అన్నమాచార్య జ్ఞాపకాల పునః నిర్మాణాన్ని టిటిడి దేవస్థానం చేపట్టాలని కాకినాడలో శ్రీవారి భక్తులు కోరారు. ఈ అంశాన్ని డిమాండ్ చేస్తూ 25న తిరుమల కొండపై సనాతన సమధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యాన విశిష్ట స్వాములు చేపట్టిన మౌనదీక్షలకు మద్దతుగా సోమవారం ఉదయం నుంచి కాకినాడ భోగిగణపతి పీఠంలో శ్రీవారిభక్తులు గోవిందసహస్ర నామ పారాయణ నిర్వహించి సంఘీభావం తెలిపారు.పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణ రాజు విన్నూత్న రీతిలో శంఖాన్ని పూరించివిశిష్ట స్వాముల మౌన దీక్షలకు మద్దతు ప్రకటిం చారు. ఈసందర్భంగా మాట్లాడుతూ శ్రీవారి కొండపై అన్నమయ్య నివసించిన ఇల్లు, మండపం, ఆరాధించిన దేవతావిగ్రహాలు అన్నమాచార్యుని ఏకశిలావిగ్రహం భవిష్యత్తు తరాల కోసం ప్రతిష్టిం చాలని డిమాండ్ చేశారు. కొండమీద 365రోజులు 24గంటల పాటు నిత్యం భజన కీర్తనలు నిర్వహించే జానపద కళాకారుల ప్రాచీన సంస్కృతీ వైభవాన్ని పునరుద్దరణ చేయాలని కోరారు. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి, యోగివేమన మున్నగు మఠాలను విశిష్టంగా అభివృద్ధి చేయాలని.. తిరుమల కొండమీద దక్షిణాది మఠాలకు తగిన ప్రాధాన్యత వుండాలని కోరారు. భజనసామ్రాట్ పట్టా రామదాసు అఖండ మంగళహారతి అందజేశారు. మహాలక్ష్మి సూర్యనారాయణమ్మ మంగతాయారు భాగ్యలక్ష్మి సీత పద్మలత తదితరులు పాల్గొన్నారు.